TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పాపం రాజుగారి పరువు తీసేశారుగా...

Published on: Wed Apr 18, 2018 5:13PM

 

పాపం టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి 'అశోక్‌గజపతిరాజు' పరువు అడ్డంగా తీసేశారు టీడీపీ కార్యకర్తలు. వాళ్లు చేసిన పనికి ఆయన పరువు మొత్తం పోయినట్టైంది. ఇంతకీ అంతలా టీడీపీ కార్యకర్తలు ఏం చేశారనుకుంటున్నారా...? అసలు మ్యాటరేంటంటే... ఏపీ ప్రత్యేక హోదా పోరాటం నేపథ్యంలో మిత్ర పక్షాలుగా ఉన్న టీడీపీ-బీజేపీ పార్టీలు తెగదెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు పార్లమెంట్లో సైతం మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఇక ఈ పోరాటంలో భాగంగానే కేంద్రమంత్రులు సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజు రాజీనామా చేశారు.

 

అయితే మంత్రి పదవి వదిలేసిన తరువాత తొలిసారి 'అశోక్‌గజపతిరాజు' విజయనగరం జిల్లాకు వచ్చారు. ఇక ఆయన రాకను స్వాగతిస్తూ కార్యకర్తలు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇక్కడే కార్యకర్తలు ఓ ఘనకార్యం చేశారు. రాజు గారిని పొగిడే క్రమంలో అసలు ఏం రాస్తున్నామో.. ఏంటో అని కూడా చూడకుండా ఫెక్సీలు పెట్టారు. ఇంతకీ ఫెక్సీల్లో ఏం రాశారనుకుంటున్నారా..? చూడండి మీరు కూడా ఆ ఘనకార్యం... 'రాజు కళంకితుడు'...రతిరాజు,శరీర విహీనుడు, దిగంబరుడు, గుహంతరవాసి.. ఇవి రాజుగారిని పొడుగుతున్నామనుకుంటూ టీడీపీ కార్యకర్తలు చూపించిన వెర్రితనం. ఇక ఈ ఫ్లెక్సీలు చూసినా.. వాళ్లందరూ అసలు వీరికి తెలుగు వచ్చా...? రాదా..? అసలు తామేం రాస్తున్నారో...ఏమి రాయించారో కూడా చూడలేదా..? 'వీళ్ల'కు పై పదాల అర్థాలు తెలుసా..? తెలిసే..రాశారా..? లేక...తెలియక రాశారా..? వీళ్ల తెలివితక్కువ తనానికి రాజుగారి పరువును గంగలో కలిపేశారని సెటైర్లు విసురుతున్నారు.