మొదలైన విలేజ్ వాలంటీర్ల చేతి వాటం!!

 

 

ప్రభుత్వాన్ని గ్రామాలలో ప్రజలకు మరింత చేరువగా తీసుకు వెళ్లేందుకు గాను విలేజ్ వాలంటీర్ల వ్యవస్థను తీసుకు వస్తున్నట్లు ఎపి సీఎం జగన్ చెప్పిన విషయం తెలిసిందే. దీని ప్రకారమే రాష్ట్ర వ్యాప్తంగా విలేజ్ వాలంటీర్ పోస్టులను భర్తీ చేయడం కూడా జరిగింది. ఈ పోస్టుల భర్తీలో కొంత మంది వైసిపి నాయకులు అభ్యర్థుల నుండి కొంత మొత్తం వసూలు చేసి ఉద్యోగాలు ఇప్పించినట్లు వార్తలు వచ్చాయి. మరి కొన్ని చోట్ల అధికార పార్టీ ఎమ్మెల్యేలు సూచించిన వారికే ఆ పోస్టులను ఇచ్చినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఇలా బాధ్యతలు చేపట్టిన విలేజ్ వాలంటీర్లు తమ చేతి వాటం చూపించడం మొదలు పెట్టారని ఆరోపణలు వస్తున్నాయి. చిత్తూరు జిల్లా మదనంబేడుకు చెందిన నలుగురు వ్యక్తులు తమ పిల్లలకు దృవీకరణ పత్రాలు కావాలని విలేజ్ వాలంటీర్లను ఆశ్రయించగా వారు ఒక్కక్కరి దగ్గర నుంచి ఐదు వేలు డిమాండ్ చేసి వసూలు చేశారట. అంటే కాకుండా అక్కడి ప్రభుత్వ ఉద్యోగుల అండతోనే వారు ఆలా వసూలు చేశారని తెలుస్తోంది. మొత్తానికి డబ్బులు పోసి కొన్న ఉద్యోగానికి ఇప్పటి నుంచే వసూలు చెయ్యడం మొదలు పెట్టేశారని టాక్ నడుస్తోంది.