తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో అవినీతి ఎక్కువే- నివేదిక


 

అభివృద్ధిలో దూసుకుపోతోందంటూ మురిసిపోతున్న తెలంగాణ ప్రభుత్వం, గొప్ప రాష్ట్రాన్ని నిర్మిస్తున్నామని ఆంధ్ర ప్రభుత్వం మురిసిపోతూ ఉండొచ్చుగాక! కానీ ఈ రెండు రాష్ట్రాల్లో ప్రజలు అవినీతి కింద నలిగిపోతున్నారని హెచ్చరిస్తున్నారు నిపుణులు. సీఎమ్‌ఎస్‌ అనే ఓ సంస్థ నివేదిక ప్రకారం తెలంగాణ దేశంలోనే అవినీతిలో రెండో స్థానంలో ఉండగా, ఆంధ్రరాష్ట్రం నాలుగో స్థానంలో ఉంది. విద్య, వైద్యం, రవాణా, రక్షణ లాంటి రంగాలలో ఉన్న అవినీతి ఆధారంగా ఈ జాబితాను నివేదించారు. తెలంగాణలో73 శాతం మంది తాము ప్రభుత్వ సేవలను వినియోగించుకునేందుకు అధికారుల చేయి తడపాలని ఈ నివేదిక అధికారుల దగ్గర వాపోయారు. మరి ఈ నివేదికను ప్రభుత్వాలు ఎంత సీరియస్‌గా తీసుకుంటాయో వేచి చూడాలి!