హైదరాబాద్ నిల్.. ఏపీ ఖజానా ఫుల్..

 

సరదాకి అన్నారో.. లేక  సీరియస్ గా అన్నారో తెలియదు కానీ నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ బలే మాట అన్నారు. ఇంతకీ ఆ మాట ఏంటనుకుంటున్నారా..? హైదరాబాద్ ఉన్న వారంతా ఏపీకి తిరిగివస్తే రాష్ట్రానికి ఎలాంటి ఆర్ధిక సమస్యలూ ఉండవని. ఇంతకీ ఆయన ఆ మాట ఎందుకన్నారంటే.. సంక్రాంతి పండుగ రోజు హైదరాబాద్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. రోడ్లన్నీ ఖాళీగా, ఎక్కడా జనాలు లేక, హోటళ్లు అన్నీ ఖాళీగానే ఉంటాయి. ఎందుకంటే హైదరాబాద్ లో 40శాతం మంది ఆంధ్రావారే ఉంటారు కాబట్టి. ఇక ఆంధ్రావారికి సంక్రాంతి పెద్ద పండుగ కాబట్టి హైదరాబాద్ లో ఉన్న వారందరూ ఏపీకి వెళతారు. దాదాపు అందరూ తమ సొంత ఊళ్లకు వెళతారు కాబట్టి.. హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోతుంది.

 

ఇక దీనిపైనే రాజీవ్ కుమార్ స్పందించి హైదరాబాద్ లో 40 శాతం మంది ఏపీ వాళ్లే ఉన్నారు. పన్ను చెల్లించేవాళ్లలో 40శాతం మంది ఆంధ్రావాళ్లే ఉన్నారు. వాళ్లంతా తిరిగి ఏపీకి వస్తే ఖజానాకు ఎలాంటి కష్టాలు ఉండవు. అంతేకాదు మీరే మిగిలిన వారికి సహకరించే పరిస్థితికి ఎదుగుతారు అని అన్నారు. సంక్రాంతిని తెలంగాణలో పెద్దగా చేసుకోరు. అధికంగా చేసుకునేది ఆంధ్రాలోనే... అందుకే హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోతుంది. సినిమావాళ్లు, జాబ్స్ చేసేవాళ్లు, బిజినెస్ చేసేవాళ్లు, కాంట్రాక్టర్లు అందరూ ఆంధ్రావారే. ఈరోజు హైదరాబాద్ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉందంటే దానికి కారణం ఏపీ వారే అని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. మరి అలాంటి వారిని తెలంగాణ ప్రభుత్వం ఏపీ వాళ్లు అని చూడకుండా కాస్త గౌరవంగా చూసుకుంటే బావుంటుందని అభిప్రాయపడుతున్నారు. మరి కేవలం ఒక్క పండుగ రోజే హైదరాబాద్ పరిస్థితి ఇలా ఉంటే..ఇంక ఏపీ వాళ్లు మొత్తానికే ఖాళీ చేసి వెళిపోతే పరిస్థితి ఇంకేలా ఉంటుందో. ఇప్పుడు మిగులు బడ్జెట్ అని సంకలు గుద్దుకుంటున్న తెలంగాణ పరిస్థితి ఎలా ఉంటుందో..?