జనవరి 13వ తేదీన కేసీఆర్ ను కలవనున్న ఏపీ సీఎం జగన్

జనవరి 13వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ కానున్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఏపీ రాజధాని పై చర్చ జరుగుతున్న కీలక సమయంలో కేసీఆర్ , జగన్ భేటీ ప్రాధాన్యత సంతరించుకోనుంది.14,15,16 మూడు రోజులు సంక్రాంతి సెలవు రోజులు కావడంతో ఈ నెల 18వ తేదీన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది. అదే రోజు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కూడా జరగనుంది.

ఈ ఇరు రాష్ట్రాల ముఖ్య మంత్రులు 7 నెలల కాలంలో మూడో సారి సమావేశమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కు తాజాగా రాజధాని తరలింపుకు సంబంధించిన వివాదం,ఎన్నో ఉద్యమాలు రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలు ఉధృతం ఎగిసిపడుతున్న తరుణంలో ఈ సమావేశం జరగటం పై చర్చలు మొదలయ్యాయి.ముఖ్యంగా విభజన వివాదాలతో పాటు గోదావరి నీటిని కృష్ణాకి అక్కడి నుంచి పెన్నాకు అనుసంధానం పీఠం మీద ఒక బృహత్ పథకాన్ని ఇరు రాష్ట్రాల ముఖ్య మంత్రులు గత రెండు సమావేశాలల్లో కూడా చర్చించినట్లు సమాచారం. 

రెండు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులతో సమావేశం అవ్వడమే కాకుండా కంబైన్డ్ మీటింగ్ నిర్వహించుకొని ఇరు ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు. ఈ సమావేశాల సందర్భంగా నీటిని ఏ విధంగా తీసుకురావాలనే అంశంపై ఒక రూట్ మ్యాప్ ను రూపొందించగా తరువాత కొద్ది రోజుల పాటు సమావేశాలు ఆగిపోయాయి. కేంద్రంలో అనేక రాజకీయ పరిణామాలు సంభవించాయి. రాజధాని తరలింపు పై టీఆర్ఎస్ వైపు నుంచి ఎటువంటి స్పందన అధికారికంగా లేక పోయినప్పటికీ హైదరాబాద్ లో ఉంటే రాజధాని జిల్లాలలోని ఆంధ్రా ప్రజలు రాజధాని తరలింపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీరి సమావేశం జరుగుతుంది..సమావేశం జరుగుతున్న తరుణం లోనే విద్యుత్ ఉద్యోగుల వివాదం తెర పైకి వచ్చింది. తెలంగాణ నుంచి రిలీవైన దాదాపు 900 మంది ఉద్యోగుల్ని ఆంధ్రప్రదేశ్ లో పదవీ బాధ్యత లు స్వీకరించకుండా నిన్న ఏపీ ట్రాన్స్ కో అధికారులు నిలిపివేశారు. ఇప్పుడు ఈ ఉద్యోగుల్ని చేర్చుకోవడం సాధ్యం కాదని వెల్లడిస్తున్నారు ఏపీ ట్రాన్స్ కో. ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రుల భేటీ వల్ల ఏం జరగనుందో వేచి చూడాలి.