అసెంబ్లీకి తెలంగాణ నోట్ తీర్మానం..!!

 

 

 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఎలాంటి షార్ట్‌కట్స్ ఉండబోవని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. విభజనపై చట్టాలు, రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటామని తెలిపారు. విభజనపై ముసాయిదా బిల్లు రాష్ట్ర అసెంబ్లీకి వెళుతుంది. శాసనసభలో దీనిపై చర్చ జరుగుతుందని వివరించారు.

 

ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి తిరిగి రాగానే ముసాయిదా బిల్లును ఆయనే అసెంబ్లీకి పంపిస్తారని చెప్పారు.విభజనపై ఏర్పాటు చేయబోయే మంత్రివర్గ బృందం సహజంగా రాష్ట్రానికి వెళ్లదని, రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు, ప్రతినిధుల నుంచి సలహాలు మాత్రం స్వీకరిస్తుందని వెల్లడించారు.



హైదరాబాద్ పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉన్న సమయంలో నగరంపై అధికారం గవర్నర్ లేదా కేంద్రం చేతిలో వు౦టుదని వ్యాఖ్యానించారు.