TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు!

Published on: Thu Sep 19, 2024 11:06AM

జగన్ హయాంలో తిరుమల పవిత్రతకు ఎంత భంగం కలిగించాలో అంతా కలిగించారు. తిరుమల కొండపై పారిశుద్ధ్యం నుంచి, ఆధ్యాత్మిక వాతావరణాన్ని కూడా నాశనం చేశారు. తిరుమలలో ఎన్ని అరాచకాలు చేయాలో అన్నీ చేశారు. అన్యమత ప్రచారం నుంచి జగన్ హయాంలో తిరుమలలో జరగని అపచారం లేదు. తేలిపోయింది.  జగన్మోహన్ రెడ్డి, హిందూ ధర్మ వ్యతిరేకి అయినా కాకున్నా, హిందువు అయితే కాదు.  ఇది జగమెరిగిన సత్యం.

అయితే జగన్ అధికారంలో ఉన్న సమయంలో తిరుమల కొండ వేదికగా జరిగిన  పరిణామాలు గమనిస్తే  ఆయన హిందూ ధర్మ వ్యతిరేకి అనేందుకు సందేహించవలసిన అవసరం లేదు. జగన్ అధికారంలో ఉన్న సమయంలో హిందూధర్మంపై ఒక విధంగా దాడి జరిగిందని చెప్పవచ్చు. ఆయన అధికారంలో  ఉన్న కాలంలో ఎన్నో దేవాలయాల మీద దాడులు జరిగాయి. , ఎక్కడెక్కడ దేవుని ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయి. చివరకు ఏడుకొండల వెంకన్నదేవుని సన్నిధిలో  అన్యమత ప్రచారం జరిగింది.  ఏడుకొందలపై  ఆగమ శాస్త్ర విరుద్ధంగా డ్రోన్లు సంచరించాయి.  టీటీడీ నియామకాలలో అన్యమతస్తులకు రిజర్వేషన్ కల్పిస్తూ టీటీడీ నిర్ణయం వరకూ జగన్ అధికారంలో ఉండగా దేవదేవునివిషయంలో జరగని అపచారం లేదు.  ఒక్క మాటలో చెప్పాలంటే  హిందూ ధర్మ రక్షణ కోసం ఏర్పడిన తిరుమల తిరుపతి దేవస్థానం జగన్ అధికారంలో ఉన్న కాలంలో ధర్మ విరుద్ధ చర్యలకు నిలయంగా మారింది. , హిందూ ధర్మ సంస్థలు ఈ విషయాన్ని అప్పట్లో పదే పదే చెప్పాయి. ఆరోపించాయి. ఫిర్యాదులు చేశాయి. ఆవేదన వ్యక్తం చేశాయి.

ప్రసాదం ధర మొదలు వసతి గదుల అద్దెల వరకూ దొరికినంత దోచుకో  పద్దతిలో అప్పట్లో టీటీడీ దోపిడీకి పాల్పడిందన్న విమర్శలు వెల్లువెత్తాయి.  ఇక ఆర్జిత సేవల విషయం అయితే చెప్పనే అక్కర లేదు.  భక్తులకు సమకూరుస్తున్న సదుపాయాలు నిర్వహణ అత్యంత అధ్వానంగా ఉండేది. స్వామి దర్శనం కోసం క్యూ కాంప్లెక్స్ లో గంటలు తరబడి నిరీక్షించే భక్తుల ఆకలి  దప్పికలు తీర్చేందుకు సమయానుకూలంగా జరిగే ప్రసాద వితరణ బంద్ అయిపోయింది. చివరికి  జల ప్రసాదం కూడా  అందుబాటులో  ఉండేది కాదు.  క్యూ కాంప్లెక్స్ లో పారిశుధ్యం ఆనవాలే కనిపించేది కాదు   దుర్వాసనలు భరిస్తూ  భక్తులు  స్వామి దర్శనానికి నిరీక్షించ వలసి వచ్చేది.  గోవింద నామ స్మరణ తప్ప మరో పేరు వినిపించడమే అపచారంగా భావించే తిరుమల కొండపైన ఏకంగా రాజకీయ జెండాలు, స్టిక్కర్లు దర్శనం ఇచ్చాయి. ఇవన్నీ అందరికీ తెలిసిన అందరికీ కనిపించిన విషయాలు.

కానీ అంతకు మించిన అపచారాలు కూడా జగన్ హయాంలో తిరుమల కొండపై జరిగాయని ఇప్పుడు వెలుగోలోకి వచ్చింది. అడ్డూ ప్రసాదం కూడా అపవిత్రం చేశారు. వైసీపీ అధికారంలో ఉండగా తిరుపతి లడ్డూ ప్రసాదం నాణ్యత నాసిరకంగా తరాయైందని  భక్తులు పెద్ద ఎత్తున ఆఱోపణలు గుప్పించాయి. అందుకు కారణమేంటో ఇప్పుడు బయట పడింది.   స్వచ్ఛమైన ఆవు నెయ్యి వాడాల్సిన తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వును గత వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం వాడింది. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి సమావేశంలో చెప్పారు. జగన్ హాయాంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్ వాడితే.. తాము అధికారంలోకి రాగానే అన్నీ నాణ్యమైన పదార్థాలతో లడ్డూ ప్రసాదాన్ని తయారు చేయిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. తిరుమలలో గత ఐదేళ్ల కాలంలో అత్యంత ఘోరమైన పనితీరు ఉండేది. ఆధ్యాత్మిక వాతావరణం అసలు కనిపించేదే కాదు. ఇప్పుడు తెలుగుదేశం కూటమి  ప్రభుత్వం వచ్చాక  ఒక్కటొక్కటిగా అన్నిటినీ దారిలోకి తీసుకువచ్చారు. పారిశుద్ధ్యం, భక్తుల సౌకర్యాలు, క్యూ కాంప్లెక్స్ లలో ప్రసాద వితరణ, జలప్రసాదం అందుబాటులోకి వచ్చాయి. 

ఇది కూడా చదవండి.. ఏడుకొండల పైన కొత్తా దేముడు.. ఎవరో తెలుసా?