అంబ పలికె...రాంబాబు పలికె...

 

వై.యస్సార్. కాంగ్రేసు పార్టీలో నోరున్న పెద్దమనుషుల్లో అంబటి రాంబాబు కూడా ఒకరు. అసలు నోరున్డటమే ఈరోజుల్లో రాజకీయాలకి ఒక ప్రధానార్హత కూడా గనుక అంబటి తిరుగులేని రాజకీయ నాయకుడుగానే చెప్పుకోవచ్చును.

 

అదేదో సినిమాలో హీరోకి నోటి దూల ఎక్కువ ఉండటమే ప్రత్యేక ఆకర్షణగా నిలిచినట్లు, మన రాంబాబుగారికీ ‘బూతుల పంచాంగ స్పెషలిస్టు’గా మంచి పేరున్నసంగతి, తన ప్రావీణ్యాన్ని పార్టీ మహిళా కార్యకర్తల దగ్గర విరివిగా ఉపయోగిస్తారని మీడియాకి ఎవరో గిట్టని వాళ్ళు ఉప్పందిన్చినప్పుడు, అయన మీడియాలో కొన్ని రోజులు ఒక వెలుగు వెలిగేరు. అప్పుడు కొంచెం తగ్గినా మళ్ళీ ఇప్పుడిపుడే ఆయన పున్జుకొంటూ మళ్ళీ మీడియాలో నిత్యం కనిపించడం ప్రారంబించేరు.

 

మొన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిగారు ఇందిరమ్మని తలచుకొంటూ వైజాగ్ బాట పట్టినప్పుడు, జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకోస్తున్నవనే ప్రతిపక్షాల నీలపనిందలు భరించలేక, ఆ కోపంలో జగన్ని ఓ దులుపు దులిపపేసారాయన. “అతను అనేక అక్రమాలకి పాల్పడాడు గాబట్టే జైల్లో పడ్డాడు. అతనిపట్ల మనం జాలి చూపనవసరం లేదు. అతనేమయిన జైల్లో ఉన్న స్వతంత్ర సమరయోదుడా గౌరవించడానికి?” అంటూ దులిపోదిలి పెట్టారాయన.

 

అప్పుడు జగన్ ఉప్పు తింటున్న కారణంగా అంబటి కూడా మళ్ళీ మీడియా ముందుకు వచ్చి నోరు చేసుకోవలసి వచ్చింది. అంబ పలికే...రాంబాబు పలికే....అంటూ కాంగ్రెస్ పార్టీ రాజకీయ భవిష్యత్ ఏ విదంగా ఉండబోతోందో అయన జాతకం వేసి చెప్పేసాడు.

 

“ఒకప్పుడు కేవలం 26 సీట్లు మాత్రమే గెలుచుకొని రాష్ట్ర రాజకీయాలలో ఒక సరికొత్త రికార్డ్ నెలకొల్పిన మీ కాంగ్రెస్ పార్టీ, రేపు రాబోయే ఎన్నికలలో కేవలం 16 సీట్లు మాత్రమె గెలిచి మీ పాత రికార్డుని మీరే బద్దలు కొట్టుదురు గాక....” అంటూ పిల్లిశాపాలు పెట్టినట్లు కిరణ్ కుమార్ రెడ్డిని శపించి పడేసాడాయన.

 

అంతేగాకుండా తమ నేత కాంగ్రేసులో ఉన్నపుడు లక్ష తొంబై వేల ఓట్లు సాదిస్తే, కాంగ్రేసు నుండి బయటకి వచ్చేసిన తరువాత జరిగిన ఎన్నికలలో 5.4 లక్షల ఓట్లు సాదించేడని మీడియా ముఖంగా కిరణ్ కుమార్ రెడ్డికి అయన తెలియజేసారు.

 

సోనియమ్మని ఆయన ఎదిరించినందుకే ఇప్పుడ జైల్లో మగ్గ వలసి వస్తోందే తప్ప అక్రమార్జన వల్లమాత్రం కాదని కిరణ్ కుమార్రెడ్డి గారికి ఆయన జ్ఞాపోదేశం కూడా చేసేరు.

 

మొత్తం మీద అంబటి వారు వేసిన కాంగ్రెస్ జాతక చక్రంలో మరి జగన్ పేరుందో లేదో అయన చెప్పలేదు. ఎందుకంటే, రాహుల్ బాబు ‘మళ్ళీ మనం జగన్నివాటేసుకొంటే జనం నవ్వుతారా లేదా? ఏమనుకొంటారు? అని రాష్ట్ర నేతలని అడిగినట్లు సమాచారం. మరటువంటప్పుడు కాంగ్రేసుకి కేవలం 16 సీట్లు మాత్రమే వస్తే తనకీ ఇబ్బందే కదా?