TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమల గిరుల సాక్షిగా అమరావతి నినాదం.. రాజధాని రైతుల సంబరం

Published on: Sat Dec 18, 2021 9:52AM

తిరుమల గిరుల సాక్షిగా అమరావతి నినాదం మార్మోగింది అమరావతే ఏకైక రాజధాని అంటూ వెంకన్న పాదాల కింద సింహనాదం వినిపించింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష తిరుపతి వేదికగా స్పష్టమయింది. అమరావతి రైతుల సభకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. అమరావతి రైతు నినాదానికి అన్ని రాజకీయ పార్టీల అతిరథ మహారథలు జతకట్టారు. కలిసి నినదించారు. వంద మందికిపైగా పట్టేలాస్టేజ్‌ను రూపొందించారు. అయితే అన్ని పార్టీల నుంచి నేతలు తరలిరావడంతో స్టేజ్ కూడా కిక్కిరిసిపోయింది.

రైతులు నిర్వహించిన మహోద్యమ సభకు హాజరైన అన్ని పార్టీల నేతలు.. ఏకైక రాజధానిగా అమరావతి ఉండాని నినదించారు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అంగీకరించి అడ్డగోలుగా చేసిన మోసాన్ని అందరూ ప్రజల ముందు పెట్టారు. చివరికి వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా అదే చెప్పారు. తిరుపతి మహోద్యమ సభలో  ఎక్కడా భిన్నాభిప్రాయం వినిపించలేదు. అమరావతి నిర్మాణం చేతకాకపోతే తప్పుకోవాలని అందరూ ముక్త కంఠంతో జగన్‌కు సలహా ఇచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు సహా అందరూ అమరావతి ఆకాంక్ష ప్రజల్లో ఉందని.. అమరావతి ప్రజారాజధానిగా స్పటం చేశారు. జగన్‌రెడ్డిది చేతకాని అసమర్థ ప్రభుత్వమని చంద్రబాబు మండిపడ్డారు. బీజేపీ తరపున హాజరైన కన్నా లక్ష్మినారాయణ హాజరై దోచుకునేందుకు విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారని విమర్శించారు.

అమ‌రావ‌తి అంద‌రి రాజ‌ధాని.. ధ‌ర్మ‌పోరాటం ఆగ‌ద‌న్న చంద్ర‌బాబు..

ఏపీ రాజధాని అమరావతిని కాపాడుకునేందుకు రైతులకు ఆది నుంచి టీడీపీ ఒక్కపార్టీనే కాదు .. ఏపీలో ఉన్న అన్ని రాజకీయపార్టీలు, వామపక్షాలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు పూర్తి మద్దతునిచ్చాయి. ఒకటే రాజధాని.. అది ఏపి అమరావతేనని ఆకాంక్షించారు. శుక్రవారం తిరుపతి వేదికగా అమరావతి పరిరక్షణ ‘మహోద్యమ సభ’..అమరావతి అందరిది అన్న ట్యాగ్ లైన్ తో రైతులు భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభకు ఏపీలోని ప్రతి పార్టీ నుంచి పదిమందికి పైగా నేతలు వచ్చి .. సభలోప్రసంగించారు. రైతుల కోసం ఎంత దూరమైన వస్తామని .. రాజధానిని కాపాడుకునేందుకు దేనికైనా సిద్దమని తెగెసి చెప్పారు. జగన్ రెడ్డి ముర్ఖత్వంతోనే ఏపీలో పరిస్థితులు ఇలా దాపురించాయని, అమరావతిని తప్పనిసరిగా కాపాడుకుంటామని తేల్చి చెప్పారు. 

అమ‌రావ‌తి రూప‌శిల్పి చంద్ర‌బాబు.. రాజ‌ధాని మార్చ‌డం అసాధ్య‌మ‌న్న ర‌ఘురామ‌

రైతుల ఆహ్వానం మేరకు తెలుగుదేశం, బీజేపీ, జనసేన, కాంగ్రెస్, వామపక్ష నేతలు సభకు హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, నటుడు శివాజీ, మాజీ మంత్రులు రావెల, పరిటాల, ఆదినారాయణ రెడ్డి తదితరులు ముఖ్యనేతలు వేదికపై ఆశీనులై, ముక్తం కంఠంతో ఏపీ రాజధాని అమరావతేనని నినదించారు. అమరావతికి భూములు ఇచ్చిన రైతులు నెలన్నర పాటు న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ పాదాయత్ర చేసి తమ సంకల్పాన్ని చాటారు. ఎన్ని విమర్శలు.. లాఠీచార్జ్‌లు.. నిర్బంధాలు ఎదురైనప్పటికీ సభకు భారీగా జన సమూహం తరలి రావడంతో రైతులు తమ ప్రయత్నాల్లో మరో అడుగు ముందుకేశామన్న సంతృప్తి వ్యక్తం చేశారు.