TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అమ‌రావ‌తి రూప‌శిల్పి చంద్ర‌బాబు.. రాజ‌ధాని మార్చ‌డం అసాధ్య‌మ‌న్న ర‌ఘురామ‌

Published on: Fri Dec 17, 2021 4:17PM

ఏపీ రాజ‌ధాని అమరావ‌తి రూప‌శిల్పి చంద్ర‌బాబు.. ఆయ‌నే అమ‌రావ‌తిని సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడ‌ల్‌గా రూపొందించార‌ని వైసీపీ రెబెల్ ఎంపీ ర‌ఘురామ కృష్ణ‌రాజు అన్నారు. తిరుప‌తి మ‌హాద్య‌మ బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన్న ర‌ఘురామ‌.. ఏకైక రాజ‌ధాని కోసం పాద‌యాత్ర చేసిన ప్ర‌తీ ఒక్క‌రినీ కొనియాడారు. పాద‌యాత్ర‌లో మ‌హిళ‌ల‌ను ఎన్నో ఇబ్బందుల‌కు గురి చేశార‌ని మండిప‌డ్డారు. పాద‌యాత్ర చేసిన మ‌హిళ‌ల త్యాగానికి ఏదీ సాటిరాద‌ని అన్నారు. 

రాజ‌ధాని అమ‌రావ‌తిని మార్చ‌డం ఎవ‌రి వ‌ల్లా కాద‌ని ర‌ఘురామ తేల్చి చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టులో ఓ చిన్న ప‌దం త‌ప్పుగా వ‌స్తేనే.. మ‌ళ్లీ పార్ల‌మెంట్‌లో చ‌ట్టం చేయాల్సి వ‌స్తోంద‌ని గుర్తు చేస్తూ.. అమ‌రావ‌తిని చ‌ట్ట ప్ర‌కారం, న్యాయ ప్ర‌కారం ఏమీ చేయ‌లేర‌ని స్ప‌ష్టం చేశారు. అమ‌రావ‌తినే ఏపీకి శాశ్వ‌త రాజ‌ధానిగా ఉంటుంద‌ని.. రాజధాని రైతులు ధైర్యంగా పోరాడాలని, అంతిమ విజయం రాజధాని రైతులదే అవుతుందని రఘురామకృష్ణరాజు అన్నారు.