ఎట్టకేలకు అక్బరుద్దీన్ ఓవైసీకి బెయిల్

 

 

Akbaruddin Owaisi bail, Akbaruddin Owaisi gets bail in hate speech case, Akbaruddin Owaisi gets bail

 

 

ఎట్టకేలకు వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అక్బరుద్దీన్ ఓవైసీకి బెయిల్ మంజూరైంది. గత కొద్ది రోజులుగా బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నా ఓవైసీకి బెయిల్ మంజూరు అవడంతో జైలు నుంచి విడుదల కానున్నారు. నిర్మల్ లలో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఆయన విద్వేషపూరిత ప్రసంగాలు చేశారన్న అబియోగంపై కేసులు నమోదయ్యాయి. నిర్మల్ పోలీసులు ఆయనను అరెస్టు చేసి జైలులో ఉంచారు.


ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కు తొలుత నిజామాబాద్ కోర్టులో బెయిల్ లభించగా, మధ్యాహ్నానికి ఆదిలాబాద్ కోర్టులో బెయిల్ మంజూరైంది. అక్బర్ ఎట్టి పరిస్థితిలోను నిర్మల్ లో అడుగు పెట్టరాదని, పాస్ పోర్టును పోలీసులకు అప్పగించాలని, పూచికత్తులు సమర్పించాలని జడ్జి ఆదేశాలు ఇచ్చారు.