అబ్దుల్ కలాం పరిస్థితి విషమం?

 

భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆరోగ్య పరిస్థితి విషమంగా వున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో వున్న ఒక ప్రైవేట్ ఆస్పత్రిలోని ఐసీయులో వున్నారు. షిల్లాంగ్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తున్న అబ్దుల్ కలాం అకస్మాత్తుగా కుప్పకూలడంతో ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారు. ఐసీయులో వున్న ఆయన పరిస్థితి విషమంగా వున్నట్టు తెలుస్తోంది. కలాం వయసు 84 సంవత్సరాలు. కలాం ఆరోగ్య పరిస్థితి మీద ఆయన చికిత్స పొందుతున్న ఆస్పత్రి వర్గాలు స్పందించాయి. ‘‘కలాం ప్రస్తుతం ఐసీయులో వున్నారు. ఆయన కార్డియాక్ అరెస్ట్ సమస్యను ఎదుర్కొన్నారని భావిస్తున్నాం’’ అని ఆ వర్గాలు చెప్పాయి. అబ్దుల్ కలాం భారత 11వ రాష్ట్రపతిగా 2002 - 2007 మధ్యకాలంలో పనిచేసిన విషయం తెలిసిందే.