నిర్భ‌య దోషుల‌కు రేపే... ఉరి అమ‌లు!

నిర్భయ దోషులకు ఉరిశిక్ష ఖారారు. క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించడాన్ని సవాల్‌ చేస్తూ దోషుల్లో ఒకడైన అక్షయ్‌కుమార్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. అయితే ఈ పిటిషన్‌ను పటియాల హౌస్‌ కోర్టు కొట్టివేసింది. దీంతో ముందుగా నిర్ణయించిన మేరకు శుక్రవారం ఉదయం 5.30 గంటలకు తిహార్ జైల్లో ఉరి తీయనున్నారు.

ఈ ఇదే కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు దోషుల్లో ఒకరైన పవన్ గుప్త ఉరిశిక్షకు ఒక్కరోజు ముందు పెట్టుకున్న క్యూరేటివ్ పిటిషన్‌ను గురువారం నాడు సుప్రీంకోర్టు కొట్టివేసింది. 2012లో నిర్భయపై సామూహిక అత్యాచారం జరిగినప్పుడు తాను మైనర్ బాలుడినంటూ పవన్ గుప్త చేసిన వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఘటన జరిగినప్పుడు తాను మైనర్‌ అయినందున ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలంటూ పవన్ గుప్తా తన పిటిషన్‌లో విజ్ఞ‌ప్తి చేశాడు.

నిర్భయ కేసు దోషుల ఉరిశిక్ష అమలుపై తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. వారికి ఉరిశిక్ష పడుతుందో లేదోనని దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు దోషులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఇక మార్చి 20వ తేదీన వారికి ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో నిందితుల్లో ఒకడైన అక్షయ్ సింగ్ భార్య అతడి భార్యగా ఉండడం ఇష్టం లేదు.. అతడితో విడాకులు ఇప్పించాలని కోర్టుకు వెళ్లింది. ఈ మేరకు విచారణ సాగుతుండగా ఆమె కోర్టు ఆవరణలో స్పృహ తప్పి పడిపోయింది. ఈ సందర్భంగా బీహర్ లోని పటియాలా హౌస్ కోర్టు ఆవరణ లో గురువారం విచారణ సాగుతుండగా ఆమె కుప్పకూలి పడిపోయింది. మార్చి 20వ తేదీన అక్షయ్ సింగ్ కు ఉరివేస్తే తాను వితంతువుగా ఉండాల్సి వస్తుందని అలా ఉండడం తనకు ఇష్టం లేదని ఆమె కోర్టులో విడాకులు కోరుతూ పిటిషన్ వేసింది. రేప్ కేసులో తన భర్తను ఉరి తీస్తే ఆ తర్వాత వితంతువుగా సమాజంలో చెడ్డపేరుతో బతకడం తన కిష్టం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. అక్షయ్ సింగ్ తో తనకు విడాకులు ఇప్పించాలని కోరింది. అయితే ఈ పిటిషన్ పై విచారణ కొనసాగనుంది.

తీహార్ సెంట్రల్ జైలు ప్రాంగణంలో మరోసారి అన్ని సన్నాహాలతో 'డమ్మీ ట్రయల్' జరిగినట్టు తీహార్ జైలు అదనపు ఇన్స్పెక్టర్ జనరల్ రాజ్ కుమార్ తెలిపారు. జైలు నెంబర్ -3 ఉరి గదిలో జైలు అధికారుల సమక్షంలో దీన్ని నిర్వహించామని, ఉరి శిక్ష అమలుకు ముందు ఇలాంటి పరీక్షలు సాధారణమైన విషయమని ఆయన తెలిపారు. ఉరి సమయంలోఎటువంటి అవాంతరాలు లేకుండా నిర్ధారించుకునేందుకు డమ్మీ ట్రయల్ ఉంటుందన్నారు. ఇది అరగంట పాటు కొనసాగిందని సీనియర్ అధికారి తెలిపారు.