రైలు ప్రమాదం: 26కు చేరిన మృతుల సంఖ్య

 

 

 

శనివారం తెల్లవారుజామున ఘోర రైలు ప్రమాదం సంభవించింది. బెంగుళూరు-నాందేడ్ ఎక్స్‌ప్రెస్ థర్డ్ ఏసీ బీ-1 బోగీలో మంటలు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈఘటనలో 26 మంది సజీవదహనం కాగా, పలువురికి తీవ్రగాయాలయ్యాయి. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణంగా అధికారులు భావిస్తున్నారు. బోగీలో ఏవైనా పేలుడు పదార్థాలు ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈఘటన జరిగిన వెంటనే ధర్మవరం,కొత్తచెరువు, పుట్టపర్తి ఆస్పత్రుల సిబ్బందిని రైల్వే అధికారులు అప్రమత్తం చేశారు. క్షతగాత్రులకు చికిత్స నిమిత్తం బెంగుళూరు, గుంతకల్లు నుంచి ప్రత్యేక రైల్లో రెండు వైద్య బృందాలను అధికారులు తరలిస్తున్నారు.

 

బాధితుల వివరాలు తెలుసుకునేందుకు అధికారులు టోల్‌ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేశారు.

టోల్‌ఫ్రీ నెంబర్ : 080 22354108, 22156554
ఫోన్ నెంబర్ : 080 22354108, 9731666863
ఫోన్ నెంబర్ : 080 22259271, 9731666863

దక్షిణ మధ్య రైల్వేశాఖ పలు జిల్లాలో హెల్ప్‌లైన్ల నెంబర్లను ఏర్పాటు చేసింది.

సికింద్రాబాద్ : 040 27700868, 9701371060
వికారాబాద్ : 08416 252215, 9701371081
తాండూరు : 08411 272010
ధర్మవరం : 08559 224422
సేదం : 08441 276066, 7760998338
బీదర్ : 08482 226404, 7760998400
గుంతకల్లు : 0855 2220305, 09701374965
అనంతపురం : 09491221390
బెంగుళూరు సిటి : 080 22235408, 080 22156553
ప్రశాంతి నిలయం : 080 555280125