సోనియా 'అమ్మ' కాదు..రాజకీయ నాయకురాలు: పవన్

 

 

 

ఒక తల్లికి ఇద్దరూ కొడుకులుంటే ఒకరిపైన ఎక్కువ ప్రేమ చూపిస్తే..అలా ఎందుకు చేసిందో ఇంకో బిడ్డకో వివరిస్తుందని..కానీ కాంగ్రెస్ నాయకులు 'అమ్మ' అని పిలిచే సోనియా గాంధీ విభజన చేసిన తరువాత ఎందుకు విభజన చేశామో సీమాంధ్ర ప్రజలకు వివరించలేదని అన్నారు. విభజన వల్ల తెలంగాణ ప్రజలకు, సీమాంధ్ర ప్రజలకు అన్యాయం జరిగిందని అన్నారు. ఇప్పటికైనా ఏ పరిస్థితిలో విభజించామో చెప్తారా అని తాను చూశానని ఆయన అన్నారు. సోనియా గాంధీని కాంగ్రెస్ నాయకులు అమ్మ అని పిలవడం మానేయాలని అన్నారు. సోనియా అమ్మ కాదని రాజకీయ నాయకురాలని అన్నారు.