ఇంటర్ ఫలితాలలో కృష్ణా ఫస్ట్

 

 

Inter 2nd Year Results, Inter 2nd Year Results 2013, 2013  Inter 2nd Year Results

 

 

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాలను మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథి శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. మార్కులు, గ్రేడుల రూపంలో ఈ ఏడాది ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 65.36 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్‌లో 68 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 69.04 శాతం, బాలురు 62 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ ఫలితాలలో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో ఉండగా, మహబూబ్‌నగర్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే విద్యార్థులు మెరుగైన ఫలితాలను కనబరిచారని మంత్రి పార్థసారథి అభినందించారు. 2012 లో ఉత్తీర్ణతా శాతం 52.43గా ఉంది. గత ఏడాదితో పోలిస్తే 6.93 శాతం అధిక్యత సాధించినట్లు మంత్రి తెలిపారు.

 

మార్క్స్ మెమోను ఏప్రిల్ 30 ఆయా కాలేజీలకు అందజేయనున్నట్లు తెలిపారు. మే 22 ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. మే 22 ఉదయం ఇంటర్ మొదటి సంవత్సరం, మధ్యాహ్నం రెండవ సంవత్సర పరీక్షలు జరుగనున్నాయి. మే 6 సప్లమెంటరీ పరీక్ష ఫీజు చివరి తేదీ.