మణినగర్‌లో మోడి విక్టరీ

 

 Gujarat Election Results 2012, Narendra Modi, Narendra Modi Gujarat Election, Gujarat polls 2012 Narendra Modi

 

 

మణినగర్‌లో ముఖ్యమంత్రి నరేంద్రమోడి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి శ్వేతాభట్‌పై 85 వేల ఓట్ల మెజార్టీతో నరేంద్రమోడి గెలుపొందారు. మరోవైపు గుజరాత్‌లో బీజేపీ విజయం దిశగా దూసుకెళ్తోంది. దీంతో బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ఫలితాలపై ట్విట్టర్‌లో స్పందించారు. ఇక అంతా ముందు చూపేనని.. వెనుక చూపు లేదని ట్వీట్ చేశారు.



గుజరాత్ లో 112 స్థానాలలో బీజేపీ, 64 స్ధానాలలో కాంగ్రెస్ , 4 స్థానాలలో ఇతరులు ముందంజలో ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ లో మొదట ముందంజలో ఉన్న బీజేపి తరువాత వెనకబడింది. 26 స్థానాలలో బీజేపీ, 36 స్థానాలలో కాంగ్రెస్, 6 స్థానాలలో ఇతరులు ముందంజలో ఉన్నారు.