Next Page 
శ్రీ సీతారామకథ అరణ్యకాండ పేజి 1

       

 

    శ్రీ సీతారామకథ అరణ్యకాండము   

 

 

              1 వ. సర్గ


       శ్రీరాముడు దండకారణ్యములో ప్రవేశించుట :-

    1.    శ్రీరాముడు సీIతా లక్ష్మణులతో
        ప్రవేశించే - దండకవనిలోI

            అదిక్రూరమైన - కీ కారణ్యము
            కానరాదెందు - నరసంచారముI
        సింహశార్దూల - గజయూధములు
        విచ్చల విడి విహIరించు సీమలుI

            నక్కలు, తోడేళ్ళు - పక్షులు, మృగములు
            గుంపులుగా తాIరాడు తలములు .... IIశ్రీII


            1 వ సర్గ సంపూర్ణము

           2 వ. సర్గ   


    1.     వనమందొక చో - కొలను ప్రాంతమున
        కీచు రాళ్లరొద - హెచ్చుగ నుండెనుI

            తరువులు విరిగెను - తీవెలు తెగెను
            శార్దూలములు - పరుగిడు చుండెనుI

        మృగసమూహములు - చెదిరిపోయెను
        పక్షుల గుంపులు - ఎగిరి పోయెనుI

            సీతారామ ల I క్ష్మణులు మువ్వురు
            కలయ జూచుచు - ముందుకు సాగిరి .... IIశ్రీII


                  3 వ. సర్గ   


            విరాధుడు ఏతెంచుట :-

    
2.    దిక్కులదరగా - గర్జన చేయుచు
        ధరణి వణకగా - పదములు దట్టుచుI

            రంపపు కోరల - పటపట కొరుకుచు
            రక్త నేత్రముల - కొరకొర జూచుచు

        సింహశార్దూల - మృగ శరీరముల
        కరి శిరమును శూ I లమున గ్రుచ్చుకొనిI

            ఎదురేతెంచె వి I రాధుడనువాడు
            మహాకాయుడు - క్రూర రాక్షసుడు .... IIశ్రీII


       
                 2 వ సర్గ సంపూర్ణము


           3వ. సర్గ

        విరాధుడు సీతనెత్తుకొని పోవుట :-

   
1.   సుడిగాలివలె - రివ్వున వడిగొని
        చూచుచుండగనే - సీత నెత్తుకొని I

            పారిపోయెడు వి I రాధుని పైకి
            ఏడు బాణములు - రాముడు వేసె I

        గాయపడిన వి I రాధుడు మరలి
        పొదల మాటున - సీతను వదలి I

            గర్జన చేయుచు - వాడి శూలమును
            రాముని పైకి - బలముగ విసిరెను    .... IIశ్రీII


    
2.     వడిగా వచ్చెడు - వాడి శూలమును
        రామబాణము - తునకలు జేసెను I

            విరాధుడంత - కాయము బెంచి
            రామలక్ష్మణుల - వాటున జేర్చి I

        బెబ్బులివోలె - గర్జన చేయుచు
        వరుగుడి పోయె - అడవిని చీల్చుచు I

            హారామా హా - లక్ష్మణా యనుచు
            తల్లడిల్లె సీ I త ఆక్రందించుచు     ....IIశ్రీII



              3 వ సర్గ సంపూర్ణము

           4 వ. సర్గ

      విరాధుని వధ :-

  1.     రామలక్ష్మణులు - కత్తులు దూసి
        విరాధుని భుజ I ములు తెగవేసి I

            శిరమును ముఖమును - వక్షస్థలమును
            రక్తము చిందగ - గాయము చేసి I

        కాళ్లు చేతులతో - నీలుగ కుమ్మిరి
        పాతి పెట్టుటకు - గొయ్యి త్రవ్విరి I

            మృత్యు ముఖమును - న్న విరాధుడంత
            రామునకు తెల్పె I తన పూర్వగాధ .... IIశ్రీII


   
2.    "తుంబురుడను గం I ధర్వుడ నేను
        కుబేరుని సే I వించు వాడను I

            రంభతో నేను - క్రీడల దేలుచు
            మరిచిపోతి కు I బేరుని సేవలు I

        అంత శపించె కు I బేరుడు నన్ను
        అసురుడవై భువి - జన్మించుమని I

            ఎపుడు రాముడు - నను వధించునో
            అపుడే తిరిగి తుం I బురుడ నౌదునని I"IIశ్రీII


  
3.    "రామా నేటికి - ధన్యుడనైతి
        నీచే శాప వి I ముక్తుడనైతి I

            నీకు శుభమగు - తిన్నగ పొమ్ము
            శరభంగుని ఆ I శ్రమము జేరుము I

        ఆయుధములచే - చావని నేను

        పూడ్చినచో చ I చ్చి దివికేగెదను I"
            అని తెలిపిన వి I రాధుని కూల్చి

            రామ లక్ష్మణులు - పూడ్చి చంపిరి I ....IIశ్రీII



            4 వ సర్గ సంపూర్ణము 


Next Page 

WRITERS
PUBLICATIONS