ప్రపంచ మహిళా ఆరోగ్య దినోత్సవం

 

ప్రపంచం లో మహిళలు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడు తున్నారని  పలు నివేదికలు తెలియ చేస్తున్నాయి. ఎక్కడైతే స్త్రీలు పూజింప బడతారో అక్కడ దేవతలు నాట్యం చేస్తారని పురాణాలు  చెపుతున్నాయి. ఏమైతే నేమి స్త్రీలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది.ప్రతి ఏటా ప్రపంచంలో వివిద దేశాలలో సమూహాలు,దేశాలు ప్రపంచం సైతం స్త్రీ ఆరోగ్యం పై ఆలోచించాలి.స్త్రీ ఆరోగ్యం ఉత్సవాలను ప్ర్థిఏటా 2 4 మే నుండి 28మే వరకు నిర్వహించేందుకు.సమస్తలు సన్నద్ధం అవుతున్నాయి. వైద్య పరిశోదన రంగంలో నోబెల్ కు కృషి చేసిన మహిళలు , వైద్యం లోనూ, ఇటు సైన్యం లోనూ ,ఇంటిని చక్కదిద్దడం, సాంస్కృతిక రంగం లోనూ తమదైన ప్రతిభను ఆవిష్కరిస్తున్న మహిళలు ఉన్నప్పటికీ క్షేత్ర స్థాయిలో గ్రామీణ ప్రాంతాలలో పని చేస్తున్న ఆశా వర్కర్లు, రోగులను కంటికి రెప్పలా కాపాడే నర్సింగ్ సిబ్బంది  మహిళా ఆరోగ్యం కోసం కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ తెలుగు వన్ హెల్త్ అభినందనలు తెలుపు తోంది. అయితే ప్రపంచం లో మహిళలుఆరోగ్యంగా లేరని వారి అనారోగ్యానికి 10 ఆంశాలు కారణం అవుతున్నాయని అంటున్నారు.

కొన్ని ఖాటోర వాస్తవాలు ఇవి...

1)పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ కాలం జీవిస్తున్నారని చాలా దేశాలలో అభిప్రాయం ఉంది. కొన్ని ప్రత్యేక ప్రాంతాలలో తీవ్ర అనారోగ్యం తో బాధ పడుతున్నారని అయితే వీరి అనారోగ్య సమస్యకు కొన్ని సామాజిక సమస్యలు ఎదుర్కుంటున్నారని స్త్రీలు చాలా తక్కువ జీవన ప్రమాణాల తో జీవిస్తున్నారన్నది వాస్తవం.స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసాన్ని చూపడం వల్లే కొన్ని అనారోగ్య సమస్యలలో చిక్కుకుంటున్నారని ఆ నివేదికలో పేర్కొన్నారు.స్త్రీ లపై శారీరక హింస లైంగిక వేదింపుల కు గురి అవుతున్నారని ముఖ్యంగా హెచ్ ఐవి  ఊపిరి తిత్తుల  సమస్యలు ఎదుర్కుంటున్నారు.

2)అభివృద్ధి చెందిన దేశాలలో చాలామంది యువతులు ముఖ్యంగా యుక్త వయస్సులో ఉన్నవాళ్ళు గర్భం వచ్చినప్పుడు బిడ్డను ప్రసవించినప్పుడులేదా ఆ తరువాత మరణిస్తున్నారని గమనించ వచ్చు.
అభి వృద్ధి చెందుతున్న చెందిన దేశాలలో పొగాకు వాడకం క్రమంగా పెరగడం గమనించ వచ్చు. పురుషుల కంటే మహిళలు పొగతాగే వారిసంఖ్య 10 రేట్లు పెరిగింది. స్త్రీలు మహిళలు యువతులే లక్ష్యంగా పొగాకు ఉత్పత్తుల \ప్రచారం జరగడం దురదృష్ట కరం.యుక్త వయస్సు నుంచే సిగరెట్ల వాడకం క్రమంగా  పెరుగు తోంది.ఈ వ్యసనం నుంచి మహిళలు లేదా యువతులు తగ్గించుకుని విజయం సాధించిన వారి సంఖ్య పెరుగు తోంది. నేకోటిన్ ప్రత్యామ్నాయ థెరఫీ  ప్రభావంతక్కువే అని నిపుణులు తేల్చారు.

3) కోరోనా ప్యాండమిక్ లో ఆఫ్రికాలోని మహిళలు హెచ్ ఐ వి బారిన పడిన వారు దాదాపు 61% కరేబియన్ మహిళలో వైరస్ బారిన పడ్డ వారు 4 3 % లాటిన్ అమెరిక, ఆశియా, తూర్పు యూరప్ లో క్రమంగా పెరుగుతున్నారు. మహిళలు స్త్రీల పై పెరుగు తున్న హింస అనారోగ్యానికి కారణం అవుతుందా  ప్రపంచంలో 15%నుండి 71% మహిళలు శరీరక దాడులు లైంగిక దాడులు పాల్పడు తున్నది వారి భాగ స్వాములే అని తేలింది. పురుషుల వల్లే ఆర్ధికంగా ,సామాజికంగా మహిళలు వేదనకు గురికావడం శారీరక హింస కు గురి కావడం వల్లే అనారోగ్యం పాలవు తున్నారని,  శరీరం పై గాయాలు అవాంఛిత గర్భం హెచ్ ఐ వి ఇతర సుఖ వ్యదులు దీర్ఘ కాలీక ఒత్తిడి కి గురి అవుతున్నారు .    

4)ప్రపంచ వ్యాప్తంగా మహిళల పై ముఖ్యంగా 15 సంవత్సరాల వయస్సులో హింస కు గురి అవుతున్నారు. ప్రతి 5 గురు మహిళల్లో 1 క్కరికి లైంగిక వేదింపులకు గురి అవుతున్నారు.

5)ఇన్ని శతాబ్దాలు దాటినా అభివృద్ధి చెందిన దేశాలలో బాల్య వివాహాలు - కొట్టి పారేయలేం. ముఖ్యంగా 15 సంవత్సరాల లోపు బాలికలు  ఒక అంచనా ప్రకారం  8 సంవత్సరం పుట్టిన రోజుకు ముందే పెళ్లి చేసుకున్నట్లు  సమాచారం మరో 10 సంవాత్సరాల తరువాత వీటికి చైనా మీనాహింపు కాదు. ముఖ్యంగా బాలికలలో శారీరక అంశాల పై అవగాహన లేక పోవడం వల్లే హెచ్ ఐ వి వంటి రోగాల బారిన పడుతున్నారు.

6) అభివృద్ధి చెందు తున్న దేశాలలో చాలా మండి టీనేజీ యుక్త వయస్సులో ఉన్న  పిల్లలలో  14 మిలియన్లు ప్రతిసంవత్సరం ఉండవచ్చని అందులో 90% మండి తల్లులు అభివృద్ధి చెందు తున్న దేశాలలో ఉండడం ఆవేదన కలిగిస్తోంది.

7) ప్రతిరోజూ 16 0 0 నుంచి 10,0 0 0 మండి మరణించిన వారిలో గర్భంలోనే చని పోవడం గమనించ వచ్చు. అప్పుడే పుట్టిన బిడ్డలు 90 % గర్భిణీలు పురుడు పోసు కోకుండానే పురుడు పోసుకున్నాకో చనిపోతున్నారు.

8)పురుషుల కన్నా మహిళలు ఆదాయం సంపాదించే వారైతే వారు పంజరంలో ఇరుక్కు పోతున్నారు. గర్భ వతులైన మహిళల లో పిల్లలలో మాలేరియా బారిన పడిన సంఘటనలు ఉన్నాయి. దోమల బారిన పడకుండా ఉండేందుకు రక్షణగా దోమ తెరను కొనేవారు తానే కాదు తన కుటుంబాన్ని సంరక్షించేందుకు మహిళలు మదన పడుతూనే ఉంటారు.

9)పురుషుల కంటే స్త్రీలలో 50 %ఊపిరి తిత్తుల సమస్యలు తీవ్ర ఇబ్బందులు  పడుతున్నారు. చాలా దేశాలలో ఇప్పటికే మహిళలు వంటింటికే పరిమితం కావడం వల్ల వంటింట్లో వచ్చే కార్బన్ మోనాక్సైడ్ పీల్చడం వల్ల అనారోగ్యం వంటింటి   కాలుష్యం వల్లే ప్రపంచంలోని 1 /2 మిలియన్ స్త్రీలలో సంవత్సరానికి 1.3 మిలియన్ల మరణాలు కేవలం ఊపిరి తిత్తుల వ్యాధులతో మరణించారు. పురుషుల కంటే 12% మహిళలు వంటింటి కాలుష్యానికి బలై పోతున్నారు.

10) పురుషుల కంటే స్త్రీలు వినికిడి సమస్యలు బాధపడుతున్నారు. ఇతర అనారోగ్య సమస్యలబారిన పడుతున్నారు. స్త్రీ ఆరోగ్యం విషయంలో విచక్షణ గమనించ వచ్చు. పురుషులతో పాటు సమానంగా ఆకాశంలో సగం అంతరిక్షంలో సగం అన్న పదాలు ఆచరణలో మాత్రం లో విచక్షణ చూపడం గమనించ వచ్చు. పురుషులతో పాటు సమానంగా కంటిసమస్య కు చికిత్స అందక పోవడం స్త్రీలలో శస్త్ర చికిత్స విషయంలో వివక్ష ఇలా అన్నిటా కోన సాగుతూనే ఉంది. ఇప్పటికైనా ప్రపంచ దేశాలలో ఉన్న దేశాలలో ఉన్న మహిళల ఆరోగ్యానికి చర్యలు తీసుకోడం అత్యవసరం.