ప్రతి వ్యక్తి జీవితంలో పెళ్లి అనేది టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు.  చాలా స్పష్టంగా పెళ్లికి ముందు పెళ్ళి తర్వాత అని చెబుతుంటారు కొందరు. ఇది కేవలం జీవనశైలి గురించి మాత్రమే కాదు..ఆరోగ్యం, శరీరాకృతి గురించి కూడా. ముఖ్యంగా అమ్మాయిలను గమనిస్తే పెళ్ళికి ముందు సన్నగా, నాజూగ్గా ఉన్నవారు కాస్తా పెళ్లి తర్వాత లావుగా బొద్దుగా మారిపోతుంటారు. నిజానికి దీని వల్ల చాలామంది కామెంట్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటారు. అయితే పెళ్లి తర్వాత అమ్మాయిలు లావు కావడం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే..


పెళ్ళి నిశ్చయం అయినప్పటి నుండి పెళ్లి తంతు ముగిసిన భర్తతో కొత్త జీవితం మొదలు పెట్టడం వరకు అమ్మాయిల ఆహార  విధానాలు మొత్తం మారిపోతాయి. ఇక కొత్తగా పెళ్లైన జంట బయటకు వెళ్లడం. ఇద్దరూ కలసి సరదా కోసం ఆహారం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ కారణంగా అమ్మాయిల ఆహారంలో కేలరీలు బాగా పెరుగుతాయి. ఇదే వారు లావు అవ్వడానికి కారణం అవుతుంది.


ఆహార విధానం మారినా కొందరు బరువు పెరుగుతారు. పెళ్లయి అత్తవారింటికి వెళ్ళిన అమ్మాయిలు అక్కడి ఆహారపు అలవాట్లు. వంట విధానం, తినే వేళలు ఇలా ప్రతి విషయంలో మార్పులు ఎదుర్కుంటారు. ఈ కారణంగా  జీర్ణక్రియ కూడా మార్పులు చోటు చేసుకుంటుంది. కొత్త పద్దతికి జీర్ణ క్రియకు అలవాటు పడేవరకు బరువు పెరగడం కామన్.


భార్యాభర్తలు కలిసి భోజనం చేయడం అనేది కొత్తజంటకు కామన్. ఒకరికొకరు ప్రేమగా తినిపించుకోవడం,  కొత్త కొత్త వంటకాలు ట్రై చేయడం, భోజనంలో కాస్త ప్రత్యేక వంటకాలు ఉండేలా చూసుకోవడం వంటి కారణాల వల్ల సాధారణం కంటే ఎక్కువ తింటూంటారు. ఇది కూడా అమ్మాయిలు బరువు పెరగడానికి కారణం అవుతుంది.


                                            *నిశ్శబ్ద.