ఇంట్లోనే తయారు చేసిన ఈ క్రీమ్ వాడితే చాలు.. కనురెప్పలు ఒత్తుగా పెరుగుతాయి..!

 ఇంట్లోనే తయారు చేసిన ఈ క్రీమ్ వాడితే చాలు.. కనురెప్పలు ఒత్తుగా పెరుగుతాయి..!

 

 

 ఒకరి ముఖం చూసి వారి అందం గురించి చెప్పేస్తారు.  ముఖారవిందంలో చాలా విషయాలు ీలకపాత్ర పోషిస్తాయి. కళ్లు, పెదవులు, కనురెప్పలు,  కనుబొమ్మలు.. ఇలా అన్నీ ముఖారవిందాన్ని పెంచేవే.   ముఖం సహజ సౌందర్యం  వెంట్రుకలపై కూడా ఆధారపడి ఉంటుంది. ఎంత బాగా రెఢీ అయినా సరే.. కనురెప్పలు,  కనుబొమ్మలు ఒత్తుగా అందంగా ఉంటే ముఖ వర్చaస్సు మరింత పెరుగుతుంది.  చాలామంది ముఖం అందంగా కనిపించడం కోసం కనురెప్పలకు మస్కారా వేసుకుంటారు.  ఇంకొంతమంది కృత్రిమ  కనురెప్పలు పెట్టుకుంటారు. కనురెప్పలను, కనుమ్మలను సహజంగా ఒత్తుగా పెంచుకోవడం కోసం ఇంట్లోనే ఒక అద్బుతమైన క్రీమ్ తయారు చేసుకోవచ్చు. ఇదెలా తయారు చేయాలో.. దీనికి కావలసిన పదార్థాలు ఏంటో తెలుసుకుంటే..

కావలసిన పదార్థాలు..

ఆముదం
కలబంద జెల్
విటమిన్ ఇ టాబ్లెట్స్

(పై పదార్థాలు అన్నీ కావలసిన మోతాదు మేరకు పెంచుకోవచ్చు)

తయారీ విధానం..

ఒక డ్రాపర్ బాటిల్ తీసుకోవాలి. అందులో ఆముదం,  కలబంద జెల్,  విటమిన్-ఇ ఆయిల్.. మూడు పదార్థాలు వేయాలి. దీన్ని బాగా షేక్ చేయాలి. దీన్ని డ్రాపర్ బాటిల్ లో కాకుండా సాధారణ కంటైనర్ లో కూడా నిల్వ చేసుకోవచ్చు. ఇది దాదాపు కాస్త చిక్కగా క్రీమ్ లాగా మారుతుంది.  దీన్ని ఇయర్ బడ్ సహాయంతో కనురెప్పలకు అప్లై చేయవచ్చు.  ఇది కనురెప్పలలో కొత్త వెంట్రుకల పెరుగుదలకు అవసరమైన పోషణను ఇస్తుంది.  తద్వారా కనురెప్ప వెంట్రుకలు మూలాల నుండి బలంగా పెరుగుతాయి.

ఈ క్రీమ్ ను ప్రతిరోజూ 10 నుండి 15 నిమిషాల పాటు కనురెప్పల మీద ఉంచుకున్నా సరే.. చాలా అద్బుతమైన ఫలితాలు ఉంటాయట. అంతేకాదు.. దీన్ని ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు కనురెప్పలకు అప్లై చేయవచ్చు. రాత్రంతా అలాగే ఉంచుకోవచ్చు.  ఇది మరింత మెరుగైన ఫలితాలు ఇస్తుంది. దీన్ని ఉపయోగించడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్స్ట్ ఉండవు.

                                 *రూపశ్రీ.