జీ తెలుగు అప్సర అవార్డ్స్ 2026 ఫంక్షన్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఇక ఇందులో ఒక్కో రంగంలో ఒక్కో నారిని ఎంచుకుని నారీ శక్తిగా అభివర్ణిస్తూ వాళ్లకు అవార్డ్స్ అందించారు. ఇక డీసీపీ సరితా అంటే తెలియని వాళ్ళు లేరు ఆమె చెప్పే ఇన్స్పైరింగ్ స్టోరీస్ తో జీవితాల్లో చాలా మార్పులు వస్తాయనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి మేడంకి ఆమె చేస్తున్న సేవలకు గాను జగద్దాత్రి అవార్డు ఇచ్చి ఆమెకు సత్కరించి గౌరవించారు. ఆమెది విజయవాడ అని తెలిసేసరికి హోస్ట్ సుధీర్ కొంచెం తడబడ్డాడు. ఆ విషయాన్నీ మరో హోస్ట్ ప్రదీప్ చెప్పేసరికి ఆమె కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాగే సుధీర్ పెళ్లి విషయం గురించి కూడా స్టేజి మీద మాట్లాడారు. "సుధీర్ గారికి చాల మంది ఫాన్స్ ఉన్నారు చాలా బాగా చేస్తారు ...నిజంగా " అని చెప్పేసరికి అది కొంచెం మైక్ లో చెప్పండి మేడం అన్నారు సుధీర్, ప్రదీప్. దాంతో ఆమె మైక్ లో ఆ విషయాలను చెప్పారు. "మా ఇంట్లో స్పెషల్ గా మా అమ్మ సుధీర్ కి పెద్ద ఫ్యాన్. మా అమ్మ ఇంతకు ముందు సుధీర్ వాళ్ళ మేనత్త అనుకుంటా నాకు సరిగ్గా తెలీదు కానీ ఆమెతో మాట్లాడినప్పుడు సుధీర్ గురించి మాట్లాడారు. ఎప్పటిలాగే సుధీర్ కి పెళ్లెప్పుడవుతుంది అని కూడా అడిగారు. ప్రదీప్, సుధీర్ మీ ఇద్దరి స్పాంటేనిటీ యాంకరింగ్ నిజంగా చాలా గొప్ప విషయం అలా చేయడం. లేడీస్ ని కూడా చాలా ఇన్స్పైర్ చేస్తారు. లేడీస్ లో ఉన్న టాలెంట్ ని ఏదో ఒక రకంగా బయటకు తీసుకొచ్చేలా చేస్తారు. హార్టీ కంగ్రాట్స్ తో మిస్టర్ ప్రదీప్ అండ్ హార్టీ కంగ్రాట్స్ తో మిస్టర్ సుధీర్. నా పెద్ద తమ్ముడు పేరు సుధీర్. నువ్వు కూడా నాకు ఇంకో తమ్ముడివి." అంటూ చాలా జోష్ తో ఎనర్జిటిక్ గా సందడిగా మాట్లాడారు.
Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సుధీర్ పెళ్లి విషయంపై డీసీపీ సరితా కామెంట్స్...ఆయన నా రెండో తమ్ముడు
May 31, 2026 11:05AM
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com




.webp)
