మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోలో నటరాజ్ మాష్టర్ - నీతూ ఆడిన గేమ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మీరు" 70 రోజులు లవ్ మాన్షన్ లో ఎం జరిగిందో మీరు చూసారు. హోరాహోరీగా మేము ఆడిన గేమ్స్ అన్నీ చూసారు. ప్రతీ ఒక్కరూ మాకు సపోర్ట్ చేస్తూ వచ్చారు. కొన్ని చోట్ల గేమ్ వలన అగ్రేషన్ అయ్యాము. ఎందుకు ఏమిటి అనేది మీకు కూడా చెప్తాము. మీ అందరి సపోర్ట్ వలన టాప్ 5 వరకు వచ్చాము. మీ అందరి సపోర్ట్ కి థ్యాంక్యూ సో మచ్. ఇలాగే మీరంతా మా మీద ప్రేమను కురిపిస్తూ ఉండండి. మేము ఓడిపోయాము అనే చిన్న బాధ ఉంది. మీరంతా చాలా ఓట్లు వేశారు. ఆ ఓట్లు ఏంటి ఎలా అనేది మాకు కూడా తెలీదు. కానీ మీ ప్రేమ చాల గొప్పది. మేము గెలవాలని మొక్కుకున్నాము చాల ఓట్లు వేసాము అని చాలామంది చెప్పారు. ఆ ప్రేమ ముందు టైటిల్ చాలా చిన్నగా అనిపించింది. ఆ బాధ తగ్గిపోయింది. అందుకే ఈరోజు గుడికి వచ్చాము. మేము ఏ షో చూసిన ఎక్కడికి వెళ్లినా ఇలాగే తోడుండి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము " అని చెప్పారు. ఇక మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో నుంచి ఇప్పుడిప్పుడే అందరూ బయటకు వస్తున్నారు. ఇతర షోస్ లో కనిపించడం అలాగే లవ్ మాన్షన్ లో జరిగిన విషయాలను షేర్ చేసుకుంటూ వస్తున్నారు. రీసెంట్ గా జాను భాను వాళ్ళు కూడా ఒక వీడియో చేశారు ఇక నటరాజ్ మాష్టర్ - నీతూ కూడా ఎం జరిగిందో చెప్తాము అంటున్నారు మరి చూడాలి ఎం చెప్తారు అసలేం జరిగింది అనేది.
Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఓడిపోయినందుకు బాధగా ఉంది...మీరు ఆడియన్స్ విన్నర్స్ అన్న నెటిజన్స్
May 31, 2026 10:20AM
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com




