Home

»

Tv News

బిన్నీ బావ కోసమే భూమిక...కంటెంట్ చేయమన్నామా కాపురమా

May 31, 2026 11:23AM

ఢీ షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ ఎపిసోడ్ హైవోల్టేజ్ పెర్ఫార్మెన్సెస్ తో రాబోతోంది. ఇందులో భూమిక బ్లూ కలర్ కాస్ట్యూమ్ లో క్యూట్ గా డాన్స్ చేసింది.  "బావవి నువ్వు భామను నేను" అనే సాంగ్ కి చేసిన డాన్స్ ని చూసిన హోస్ట్ నందు "భూమికా ఎవరి కోసం చేసావ్ ఈ పెర్ఫార్మెన్స్"  అని అడిగాడు. "బిన్నీ బావగారి కోసం" అనగానే బిన్నీ మాష్టర్ కూడా తెగ సిగ్గుపడిపోతూ వచ్చి డాన్స్ చేసాడు. ఇక ఇదంతా చూస్తున్న ఆది ఒక డైలాగ్ వేసాడు.  "పూర్తిగా బావగా మారిన బిన్నీని చూడండి" అంటూ చంద్రముఖి డైలాగ్ చెప్పాడు. ఇక లాస్ట్ లో జతిన్ లేడీ గెటప్ లో రెడ్ కలర్ కాస్ట్యూమ్ లో వచ్చి "డోలే డోలే దిల్ జరా జరా" అనే సాంగ్ కి అద్దిరిపోయే ఒక హీట్ పెర్ఫార్మెన్స్ చేసాడు. దానికి రెజీనా, బిన్నీ మాష్టర్ ఫిదా ఇపోయారు. ఇక రెజీనా ఐతే "అన్ని షాక్ చేశారు మీరు" అంటూ కామెంట్ చేసింది. హోస్ట్ నందు ఐతే ఎంత ఆత్రంగా పెర్ఫార్మెన్స్ చూశాడో. బిన్నీ మాష్టర్ ఐతే వీలేసి మరీ తన ఆనందం వ్యక్తం చేశారు. ఇక నందు ఐతే "రెజీనా గారు వీడికి పేరేం పెడదాం" అని అడిగాడు నందు. "షా షా" అంటూ రెజీనా మంచి హాట్ పేరు చెప్పింది. ఇక పండు వచ్చేసాడు . జతిన్ పొట్ట మీద ఏదో రాసేసరికి అందరూ నవ్వేశారు. తరువాత "పొట్టిదాయి కాదమ్మో" అనే సాంగ్ కి ఈ ఇద్దరూ డాన్స్ చేశారు. ఇక ఆది ఐతే "అరేయ్ నిన్ను కంటెంట్ చేయమన్నామా కాపురం చేయమన్నామారా" అనేసరికి అందరూ నవ్వేశారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com