Home

»

Tv News

డాక్టర్ కాళ్లకు దణ్ణం పెట్టిన ప్రదీప్!

May 23, 2026 1:53PM

జీ తెలుగులో అప్సర అవార్డ్స్ 2026 ని అనౌన్స్ చేశారు. ఈ అవార్డ్స్ ఎపిసోడ్ మే 30 న ప్రసారం కాబోతోంది. ఇక ఈ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో గైనకాలజిస్ట్  డాక్టర్ సూరి శ్రీమతి లాంటి లెజెండ్ ని సత్కరించడం నిజంగా చాలా గొప్ప విషయం. 2 లక్షల మంది పిల్లలను ఆమె ప్రసవం చేశారు. ఆమె వయసు 92 సంవత్సరాలు ఇంకా ఆమె చాలా చురుగ్గా డెలివరీలు చేస్తూనే ఉన్నారు.

"నిజంగా ఆమె జనం కోసం ప్రజల కోసం చేస్తున్న సర్వీస్ ఎంతో గొప్పది" అని చెప్పారు హోస్ట్ ప్రదీప్, సుధీర్. ఇక ఆమెకు షాల్ కప్పి ఒక మొక్క ఇచ్చారు. ప్రదీప్ ఆమె కాళ్లకు దణ్ణం పెట్టుకున్నాడు. "వీటన్నిటితో పాటు మీరు డ్రైవింగ్ కూడా చేస్తున్నారా మేడం" అని అడిగాడు ప్రదీప్. "డ్రైవర్ సమయానికి దొరక్కపోతే నేనే డ్రైవ్ చేస్తా" అని చెప్పారు.

"ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే ఎం చెయ్యాలమ్మా" అని అడిగాడు సుధీర్. "నవ్వుతూ ఉండాలి ఎప్పుడూను" అని చెప్పారు. వైద్య సదుపాయాలు లేని ఆ రోజుల్లోనే ఈమె సేవలు అందించారు. రావాణా సౌకర్యం లేక కనీస వైద్య పరికరాలు కూడా అందుబాటులో మారుమూల పల్లెటూళ్లకు వెళ్లి ఈమె ప్రసవాలు చేసారు. ఈ డాక్టరమ్మకు ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే. ఈమె ఇప్పటి జనరేషన్ యువ వైద్యులకు గొప్ప ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com