Home

»

Tv News

మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ విన్నర్స్ గా పవన్ కళ్యాణ్ - వాసంతి!

May 23, 2026 12:51PM

మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో సీజన్ 1 పూర్తయిపోయింది. ఇక ఇందులో టాప్ 5 గా నటరాజ్ మాష్టర్ - నీతూ, వాసంతి కృష్ణన్- పవన్ కళ్యాణ్, నూకరాజు - ఆసియా, జాను - భాను , మహేష్ - సాండ్రా నిలిచారు. ఇక ఫైనల్ గా వాసంతి కృష్ణన్ - పవన్ కళ్యాణ్ వీళ్ళు టైటిల్ విన్ అయ్యారు. అలాగే జడ్జ్ లయ చేతుల మీదుగా 15 లక్షల చెక్ ని అందుకున్నారు.

ఇక సెకండ్ ప్లేస్ లో నూకరాజు - ఆసియా నిలిచారు. జానూ - భానుకి 1000 కి 531 పాయింట్స్ స్కోర్ చేసి ఫిఫ్త్ ప్లేస్ లో నిలిచారు. నటరాజ్ మాష్టర్ - నీతూ 554 పాయింట్స్ స్కోర్ చేసి ఫోర్త్ ప్లేస్ లో నిలిచారు.  మహేష్ - సాండ్రాకి 701 పాయింట్స్ స్కోర్ చేసి థర్డ్ ప్లేస్ లో నిలిచారు. ఇక జడ్జెస్ మాట్లాడారు. జంటలన్నీ చక్కగా ఆడాయని చెప్పారు. ఇక అనిల్ ఐతే వాసంతి కృష్ణన్ ని పొగిడేశారు. చాలా తప్పులు పవన్ కళ్యాణ్ చేసాడని వాసంతి చేసిన తప్పులు తక్కువే అని ఐనా అన్ని సరిచేసుకుంటూ వచ్చిందని అందుకే ఈరోజున టైటిల్ గెలిచారనో చెప్పారు.

ఇక చిన్నప్పుడు రాధ , చిరంజీవి గారి సాంగ్స్ కి డాన్స్ చేసి ఇప్పుడు ఇలా ఒక షోలో రాధ గారి పక్కన ప్రతీ షోలో డాన్స్ చేశానని అలాగే చిరంజీవి గారితో కూడా డాన్స్ చేశానని చెప్పారు. ఇక శ్రీముఖి వీళ్లందరినీ రోజూ తట్టుకుంటూ వాళ్ళతో టాస్కులు ఆడించడం అంటే మాములు విషయం కాదు అసలు ఆ షీల్డ్ ఆమెకు ఇవ్వాలని చెప్పారు. ఇలా ఈ సీజన్ ఫుల్ ఫన్నీగా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com