.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -12 లో..... జానూ, నందు మేకప్ సామాను కొనడానికి వెళ్తారు. అక్కడ జానూని సూర్య ఆటపట్టిస్తాడు. నువ్వు ఏంటి ఇక్కడ అని జానూ కోప్పడుతుంది. మరొకవైపు శంకర్ తోటకి వెళ్తాడు. రిజిస్ట్రేషన్ ఎప్పుడు అవుతుందట అని సింహాద్రి మనిషిని అడుగుతాడు. రిజిస్ట్రేషన్ ప్రాబ్లమ్ అయ్యేలా ఉంది అయ్యా అని అతను చెప్పగానే శంకర్ షాక్ అవుతాడు. అప్పుడే సింహాద్రి వస్తాడు. వీరభద్ర ఏమో అంటున్నాడో ఏంటని శంకర్ అనగానే ఈ తోటపై చాలా మంది కళ్ళు ఉన్నాయిరా.. ఎక్కువ ధర ఇస్తామని అమ్మిన ఓనర్ దగ్గరికి వెళ్తున్నారంట అందుకే వాళ్లకు వార్నింగ్ ఇచ్చామని సింహాద్రి అంటాడు.
వీరభద్ర అలా అనగానే చాలా భయం వేసిందిరా.. ఎందుకంటే ఈ తోట నా ఇరవై అయిదు ఏళ్ల కష్టంరా.. నా కూతుళ్ల భవిష్యత్తు అని శంకర్ ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ రేపు పెట్టుకుందామని శంకర్ అనగానే రేపు నందుని చూడడానికి వస్తున్నారన్నావ్ కదా తర్వాత పెట్టుకుందామని సింహాద్రి అంటాడు. ఆ తర్వాత మురళి దగ్గరికి వాళ్ళ అమ్మ భోజనం తీసుకొస్తుంది. ఆ తర్వాత అటుగా జానూ, నందు వెళ్తుంటే దూరం నుంచి మురళిని జానూ చూసి దగ్గరికి వెళ్లి మాట్లాడుతుంది. అక్క, నేను బయటకి వచ్చాము. మీరు వెళ్తుంటే చూసి నేను ఇక్కడికి వచ్చానని జాను అనగానే అవునా నందు వచ్చిందా అని స్కూటీపై ఉన్న నందు దగ్గరికి మురళి వెళ్తాడు. నేను వచ్చేదాన్ని బావ కానీ నేను వచ్చి నీకు ఫీలింగ్స్ పెంచడం అవుతుందని రాలేదని నందు అనగానే మురళి వెనక్కి వెళ్తాడు.
ఆ తర్వాత మురళి దగ్గరికి సూర్య వస్తాడు. నందుని లవ్ చేస్తున్న విషయం సూర్యకి మురళి చెప్తాడు. బహుశా నువ్వు తనకి నీ ప్రేమని సరిగ్గా అర్థం అయ్యేలా చెప్పలేదేమోనని సూర్య అంటాడు. నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో ఒక లెటర్ రాసి తనకి పంపమని సూర్య చెప్తాడు. నాకు రాయడం రాదని మురళి అనగానే మురళి చెప్తుంటే సూర్య రాస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
