.webp)
ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ న్యూ ఎపిసోడ్ ని వరలక్ష్మి వ్రతం స్పెషల్ థీమ్ తో తీసుకురాబోతున్నారు. ఐతే ఈ షోకి బుల్లితెర మీద కనిపించే ఆడపడుచులందరినీ పిలిచారు. వాళ్ళతో గేమ్స్ ఆడించి ఫన్ చేయించారు. ఇక ఎన్నో రోజుల తర్వాత ఈ షోకి ఒక హీరోయిన్ వచ్చింది. ఆ విషయాన్నీ శ్రీముఖి గట్టిగా అరుస్తూ చెప్పింది.
"నేను చాల చాల హ్యాపీగా ఉన్నాను ఎన్నో రోజుల తర్వాత నా పరివారానికి డెబ్జానీ వచ్చింది " అంటూ రోహిణి మొహం చూసి ఆ తర్వాత డెబ్జానీ వంక చూసి గట్టిగా అరిచింది. "నీకు ఎంత తెలుగు గుర్తుంది ఐ వాంట్ టు సి " అని శ్రీముఖి అడిగేసరికి డెబ్జానీ కూడా "అస్సలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా " అని పాట పాడేసింది తెలివిగా. ఆ తర్వాత ఏ దేవి వరము నీవు సీరియల్ హీరోయిన్ సోనియా వచ్చింది. ఆ విషయాన్నీ శ్రీముఖి అనౌన్స్ చేస్తుండగా మరో పక్క హరి సోనియాతో కలిసి "సోనియా సోనియా స్వీటీ స్వీటీ సోనియా" అనే సాంగ్ కి డాన్స్ చేస్తున్నాడు.
"నువ్వు అక్కడికెళ్లి డాన్స్ చేస్తున్నప్పుడు నిన్ను ఒక మాట అనిందిరా డెబ్జానీ" అని శ్రీముఖి చెప్పేసరికి "కొత్త బకరా దొరికింది " అంటూ తానూ ఎం డైలాగ్ చెప్పిందో డెబ్జానీ రిపీట్ చేసింది. అలాగే హరి వేసిన డాన్స్ ని ఇమిటేట్ చేసి మరీ ఫన్ చేసింది. ఇన్ని రోజుల తర్వాత డెబ్జానీ షోకి వచ్చేసరికి నెటిజన్స్ కామెంట్స్ వెల్లువెత్తాయి. " తన అందం,అభినయంతో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించే" దెబ్జానీ" గారి కొత్త సీరియల్ కోసం ఎదురుచూస్తున్నాం. ఎన్ని రోజులకు చూసాం .. సంతోషాన్ని మాటల్లో చెప్పలేము. డెబ్జానీ వస్తే ఆ వైబ్ వేరబ్బా ... " అంటూ కామెంట్స్ చేస్తున్నారు.





.webp)
