Home

»

Tv News

వరలక్ష్మి వ్రతం రోజు వరదలొస్తాయని న్యూస్ లో చూసా శ్రీముఖి

Aug 12, 2026 3:39PM

మరి కొన్ని రోజుల్లో వరలక్ష్మి వ్రతం రాబోతోంది. ఈ సందర్భంగా స్టార్ మాలో ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో వరలక్ష్మి స్పెషల్ ఎపిసోడ్ రాబోతోంది. "ఈ వరలక్ష్మి వ్రతం ఎంటర్టైన్మెంట్ మొత్తం " అంటూ చెప్పింది శ్రీముఖి. ఈ సందర్భంగా ఆడపచుల సంబరం పేరుతో ఈ ఈవెంట్ చేశారు. ఈ ఎపిసోడ్ కి ఏ దేవి వరము నీవు సీరియల్ నుంచి కొత్త హీరోయిన్ సోనియా , సంజన గల్రాని వచ్చారు. అలాగే సుజిత, జోర్దార్ సుజాత, రోహిణి, పల్లవి రామిశెట్టి ఇలా అందరూ లేడీస్ వచ్చారు.

వీళ్ళతో గేమ్స్ ఆడించారు. ఫుల్ ఎంటర్టైన్ చేయబోతున్నారు. పల్లవి రామిశెట్టి ఐతే శ్రీముఖిని రోస్ట్ చేసింది. "ఏందే  శ్రీముఖి...మంచిగున్నావా " అని మంచి సీరియస్ ఫేస్ తో అడిగింది. శ్రీముఖికి మాత్రం నవ్వుతూ "ఏ మంచిగున్నా " అని అరుస్తూ వెళ్లి హగ్ చేసుకుంది. ఎందుకంటే పల్లవి రామిశెట్టి ఎప్పుడూ కూడా అసలు సీరియస్ గా ఉండదు. అలా కూడా ఎప్పుడూ మాట్లాడాడు. అసలు షోలో మాట్లాడ్డమే తక్కువ దాంతో శ్రీముఖి ఫుల్ ఖుష్ ఐపోయింది.

తర్వాత జోర్దార్ సుజాత వచ్చి గట్టిగ కీచుగా శ్రీముఖి అని అరిచింది. దాంతో శ్రీముఖి "అదే బాయికాడ గొంతు " అంటూ చెవులు మూసుకుంది. "ఎప్పుడైనా సూపర్ ఎనర్జిటిక్ యాక్ట్రెస్ లా ఎలా ఉండాలంటే శ్రీముఖిలా ఉండాలి " అంటూ సంజన చెప్పింది. "మొన్న ఒక షోకి వెళ్లారు. అక్కడ కూడా యాంకర్ కి అదే చెప్పారు " అంటూ అవినాష్ సంజన పరువు తీసేసాడు. తర్వాత రోహిణి డాన్స్ చేసుకుంటూ వచ్చింది. "నేను ఈరోజు పొద్దున్నే న్యూస్ లో చూసా వరలక్ష్మి వ్రతం రోజు వరద వొస్తుంది అని వచ్చేసింది " అంటూ రోహిణిని వరదతో పోల్చింది శ్రీముఖి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com