
హీరో సూర్య నటిస్తున్న "విశ్వనాధ్ అండ్ సన్స్ " మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాల గ్రాండ్ గా జరిగింది. సూర్య అంటే చాలు గుర్తొచ్చే మూవీ గజినీ. ఎన్ని సినిమాలు వచ్చినా ఈ మూవీ ఆయన మూవీ కెరీర్ లో ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోయింది. ఇక విశ్వనాధ్ అండ్ సన్స్ మూవీ 14 న రిలీజ్ కాబోతోంది. వీరభద్రుడు మూవీ తర్వాత సూర్య నటిస్తున్న మూవీ ఇది. ఇక ఆడియన్స్ లో ఈ మూవీ గురించి చాలా అంచనాలు ఉన్నాయి. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో ఈ మూవీ రాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రొమోషన్స్ జరుగుతుంది. ఇక ఈ మూవీలో జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది కూడా నటించాడు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆ విషయాన్నీ చెప్పాడు అలాగే సూర్య గురించి కూడా చాలా గొప్ప స్పీచ్ ఇచ్చాడు.
"మనందరం ఇంతమందిమి ఇక్కడికి వచ్చాము అంటే దానికి ప్రధాన కారణం సూర్య గారు. సర్ గజినీ సినిమాలో మీరు మర్చిపోతారు మేము ఆ సినిమా చూసిన దగ్గర నుంచి మేము మిమ్మల్ని మర్చిపోలేదు సర్. సర్ నా ఆల్ టైం ఫేవరేట్ మూవీ జై భీం . సూర్య గారు ఈరోజున ఎంతో మంది పేద విద్యార్థుల్ని డాక్టర్స్ గా, ఇంజనీర్స్ గా తీర్చిదిద్దారు. ప్రపంచానికి వెలుగునిచ్చేది ఆ సూర్యభగవానుడు ఐతే ఎంతోమంది పేదవాళ్ల జీవితాల్లో వెలుగునిచ్చింది ఈ సూర్య భగవానుడు. ఎందుకంటే తమిళ్ నాడులో సూర్య గారు ఒక ట్రస్ట్ పెట్టారు. దానికి చిరంజీవి గరే ఇన్స్పిరేషన్ అని ఆయన చెప్పారు. కానీ పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో సూర్య గారే ఇన్స్పిరేషన్ అని చిరంజీవి గారు చెప్పారు. నిజంగా అది చాలా చాలా గొప్ప విషయం. ఒక కుటుంబాన్ని బాగా చూసుకోవడంలో కానీ, భార్యను ప్రేమించడంలో కానీ, వ్యక్తిత్వంలో కానీ, టాలెంట్ ఉండి శక్తిలేని పేదవాళ్లకు సాయం చేయడంలో కానీ, బాడీని సరిగ్గా మెయింటైన్ చేయడంలో కానీ , బాక్సాఫీసు దగ్గర లెక్కలు సరి చేయడంలో కానీ, ఆయన్ని బీట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే లైఫ్ టైం సెటిల్మెంట్. నేను ఈ మూవీలో నటించాను. " అంటూ హైపర్ ఆది అద్దిరిపోయే స్పీచ్ ఇచ్చాడు.




.webp)
.webp)
