Home

»

Tv News

Ye Devi Varamo Neevu : అంజలి బర్త్‌డే సర్ప్రైజ్.. భానుకు ఎదురైన షాక్!

Aug 13, 2026 9:31AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్  ఏ దేవి వరమో నీవు (Ye Devi Varamo Neevu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -33 లో.. భాను, గీతల కోసం అంజలి సూప్ చేసి పంపిస్తుంది. అది తాగి బాగుంది ఈ సూప్ బాగుంది.. ఆ అమ్మాయిని అప్రిషేట్ చెయ్యాలని అంజలి దగ్గరికి భాను వెళ్లి మాట్లాడతాడు. సూప్ బాగుంది అమ్మ అని చెప్తాడు. థాంక్స్ సర్ అని అంజలి అంటుంది. నీ పేరేంటి అని భాను అడుగుతాడు. అంజలి అని చెప్పగానే బాను షాక్ అవుతాడు. అప్పుడే మనీష్ వచ్చి అంజలి జవేరి అని చెప్తాడు. అయినా భాను కన్ఫ్యూషన్ లో ఉంటాడు. ఏదో ఒకటి డైవర్ట్ చేసి అక్కడ నుంచి భానుని తీసుకొని వెళ్తాడు‌ మనీష్.

 

మరొకవైపు రాజారావు ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా కేక్ ఆర్డర్ చేసి అంజలి దగ్గరికి తీసుకొని వెళ్లి సర్ ప్రైజ్ ఇస్తాడు. దాంతో అంజలి షాక్ అవుతుంది. ఈ రోజు నీ పుట్టినరోజు అని అనగానే అంజలి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ రోజు నా పుట్టినరోజు అని మీకు గుర్తు వచ్చిందంటే మా అమ్మ గురించి కూడా మీకు గుర్తువచ్చి ఉంటుంది ప్లీజ్ తాతయ్య చెప్పండి అని అంజలి రిక్వెస్ట్ చేస్తుంది. నాకు గుర్తు రాలేదని రాజారావు అబద్ధం చెప్తాడు.

 

మరొకవైపు గీత, భాను పెళ్లిరోజు సందర్బంగా మనీష్ వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాడు. ఇద్దరు కేక్ కట్ చేయబోతు.. నాన్న ఎక్కడ నాన్న వచ్చేవరకు ఆగుదామని గీతాంజలి అంటుంది. ఇప్పుడు తాతయ్య బిజిగా ఉంటారని మనిష్ చెప్తాడు. దాంతో వాళ్ళు కేక్ కట్ చేస్తారు. మరొకవైపు అంజలి ఎమోషనల్ అవుతుంది. తను బాధపడుతుంటే రాజరావు కూడా బాధపడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com