(3).webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీక దీపం2 Karthika Deepam2. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ 747లో.. జ్యోత్స్న అర్థరాత్రి లగేజ్ తీసుకుని నేరుగా కార్తీక్ ఇంటికి వస్తుంది. కార్తీక్ ఇచ్చిన టెడ్డీ, కాఫీ కప్ సహా తన దగ్గర ఉన్న జ్ఞాపకాలన్నింటినీ తిరిగి ఇచ్చేస్తూ, ఇన్నాళ్లూ బావ తనను వద్దనుకున్నాడని, ఇక నుంచి తనే బావను వద్దనుకుంటున్నానని చెప్తుంది. ఫోన్‌లో ఉన్న ఫొటోలన్నీ కూడా డిలీట్ చేశానని చెప్పి, ఈరోజు నుంచి కార్తీక్‌తో తనకు మేనత్త కొడుకు మేనకోడలు సంబంధం తప్ప మరేమీ లేదని స్పష్టం చేస్తుంది. జ్యోత్స్న నిర్ణయంతో కాంచన సంతోషపడగా, శ్రీధర్ మాత్రం ఆమె పెళ్లి గురించి ప్రశ్నిస్తాడు.
అప్పుడే సూరజ్ ఎంట్రీ ఇచ్చి జ్యోత్స్న వస్తువులన్నీ తిరిగి ఇచ్చినా ఒక్కటి మాత్రం ఇవ్వలేదని.. అదే ఆమె మనసు, అందులో ఉన్న ప్రేమ అని అంటాడు. జ్యోత్స్న షాక్ అవుతూ మనసును ఎలా తిరిగి ఇస్తామని ప్రశ్నిస్తుంది. అయితే కార్తీక్ మాత్రం జ్యోత్స్న నిర్ణయాన్ని మెచ్చుకుంటాడు. దీప, కార్తీక్‌లు సూరజ్–జ్యోత్స్నలను కలిసి భోజనం చేయించే ప్రయత్నం చేస్తారు. ఇద్దరూ కింద కూర్చుని భోజనం చేయడం, సాంబారు ఇద్దరికి ఇష్టమని శౌర్య గుర్తించడం వంటి సందర్భాల్లో వారి మధ్య ఉన్న అనుబంధం మరోసారి బయటపడుతుంది. జ్యోత్స్న మాత్రం తన ఇష్టాలకు సాక్ష్యాలు ఉండవని, మనసును కూడా చూపించలేమని పరోక్షంగా సూరజ్ వైపు చూస్తూ చెప్తుంది.
చివర్లో జ్యోత్స్న తను తిన్న ప్లేట్‌ను తానే కడుగుతానని చెప్పి అందరిని ఆశ్చర్యపరుస్తుంది. కాంచనకు ఆమె ప్రవర్తనలో వచ్చిన మార్పు అర్థం కాకపోయినా, కార్తీక్ మాత్రం జరగాల్సిన మార్పే జరిగిందని అంటాడు. జ్యోత్స్న క్యాబ్‌లో వెళ్లిపోతానని అనగా, సూరజ్ కూడా అదే వైపు వెళ్తున్నాడని కార్తీక్ చెప్పడంతో మరో ఆసక్తికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. జ్యోత్స్న సూరజ్‌ల మధ్య ప్రేమ ఉందని సూరజ్ మాటల్లో తెలుస్తుంది. అదే సమయంలో జ్యోత్స్న కూడా పరోక్షంగా సమాధానాలు చెప్తుంది. మరి జ్యోత్స్న, సూరజ్ ల మధ్య ప్రేమ చిగురిస్తుందా.. ఇద్దరు ఒక్కటవుతారా తెలిస్తే కామెంట్ చేయండి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
(1).webp)
