(1).webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ జయం (Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ 345 లో... జాతకాలు చూసి ముహూర్తం పెట్టుకోవాలని గంగ అనగానే అవును అది కూడా కరెక్టే అని పెద్దసారు అంటాడు. దానికి విశ్వ కూడా ఒప్పుకుంటాడు. మరొకవైపు అసలు ఈ గంగ ఎందుకు జాతకాలు చూపించాలి.. స్వామిని పిలిపించాలి అంది.. ఈ సంబంధం వద్దని ఏదైనా ప్లాన్ చేసిందా అని వీరు, జయ, ఇషిక అనుకుంటారు. ఆ తర్వాత శకుంతలతో గంగ మాట్లాడుతుంది. అమ్మగారు నేను ఏమైనా తప్పు చేసానా.. ఎందుకు నాపై కోప్పడుతున్నారు అని గంగ అడుగుతుంది.
నువ్వు సుధా కడుపులో పుట్టడమే నీ పొరపాటు అని శకుంతల తన మనసులో అనుకుంటుంది. నాకు ఎవరిపై కోపం లేదు.. నా పనికి అడ్డువస్తే కోపం అంతే అని శకుంతల అంటుంది. అమ్మగారు మీరు సుధా అమ్మతో.. జయని ఇంటి కోడలిని చేసుకోవడం ఇష్టం లేదు అన్నారు. మళ్ళీ ఎందుకు ఒప్పుకున్నారని గంగ అడుగుతుంది. నీ కంటే జయ చాలా రెట్లు బెటర్.. నువ్వు ఒక తాగుబోతు కూతురివి మీ అమ్మ ఒక వంటమనిషి.. నువ్వు బస్తీ అమ్మాయివి అయిన నువ్వు కోడలిగా ఇంట్లో ఉన్నావని శకుంతల అంటుంది. దాంతో గంగ కోపంగా బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తుంది. ఏమైందని రుద్ర అడుగుతాడు. ఎవరైతే నిన్ను తక్కువ చేసి మాట్లాడారా వాళ్లకి నువ్వు నీ గెలుపుతో సమాధానం చెప్పాలని రుద్ర చెప్తాడు. ఆ మాటలన్ని శకుంతల వింటుంది.
ఆ తర్వాత కార్తీక్ కి జ్వరం వచ్చిందని మక్కం ద్వారా ప్రమీలకి తెలుస్తుంది. దాంతో కార్తీక్ దగ్గరికి ప్రమీల వచ్చి తనకి ఉప్మా చేసి భోజనానికి రెడీ చేసి వెళ్తుంది. మరొకవైపు జయ జాతకం గురించి సుధా వెతుకుతుంది. ఇప్పుడు ఇవన్నీ అవసరమా అని విశ్వ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




(1).webp)
.webp)
