Home

»

Tv News

Ye Devi Varamo Neevu: దగ్గరవుతున్న అంజలి, మనీష్.. కమల కనిపెట్టేసిందా!

Nov 19, 2026 8:50AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు' (Ye Devi Varamo Neevu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ - 119 లో.... శంకర్ కి అంజలి కాఫీ తీసుకొని వస్తుంది. ఇంతకీ నువ్వు ఎవరు, ఎందుకు మా నాన్న నీకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు, ఇప్పుడు మా అమ్మ ఇస్తుందని శంకర్ అడుగుతాడు. మా ఫ్యామిలీ తాతయ్య గారికి బాగా తెలుసు.. కొన్ని పరిస్థితుల వల్ల ఇంటికి దూరం అయ్యాను‌‌‌.. తాతయ్య మంచి మనసుతో ఇక్కడికి తీసుకొని వచ్చాడని అంజలి అంటుంది. నువ్వు చెప్పేది నిజమేనా అని శంకర్ అడుగుతాడు. నిజమే అని అంజలి అంటుంది. ఒకవేళ నిజం కాకుంటే నా సంగతి తెలుసు కదా అని శంకర్ అంటాడు.

 

మరోవైపు రాకీ డ్రింక్ చేస్తుంటాడు. అప్పుడే కమల ఫోన్ చేసి ఇండియాకి వచ్చామని చెప్తుంది‌. తన ద్వారా ఇంటికి రావచ్చు అనుకొని హోప్ పెంచుకుంటాడు రాకీ. తను కూడా నువ్వు రాకులే అక్కడే ఉండి చదువుకోమని కమల అంటుంటే రాకీ ఇంకా డిస్సపాయింట్ అవుతాడు. ఆ కోపంలో ఇంకా ఎక్కువ డ్రింక్ చేస్తాడు. మరుసటి రోజు అంజలి మొక్కలకి నీళ్ళు పోస్తుంది, అప్పుడే వాకింగ్ నుంచి మనీష్ డల్ గా ఇంటికి వస్తాడు.

తను డల్ గా ఉండడం చూసి ఓహ్ మేఘమా ఎందుకు అలా ఉన్నావ్.. వర్షం కురిపించమని అంజలి అంటుంది‌. నువ్వు కురిపించు అంటే కురిపిస్తుందా అని మనీష్ అంటాడు. మనీష్ వెళ్తుంటే పైప్ తో వాటర్ తనపై కొడుతుంది.. మనీష్ కూడా అంజలిపై వాటర్ కొడుతాడు. అయ్యో జలుబు అవుద్దని మనీష్ తలని అంజలి తుడుస్తుంది. తరువాయి భాగంలో మనీష్ కి అంజలి కాఫీ తీసుకొని వస్తుంది, ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటారు.. అలా మాట్లాడుకోవడం కమల చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com