Home

»

Tv News

Podarillu:  చక్రిపై సీరియస్ అయిన‌ మహా.. విడాకులు కన్ఫమ్!

Nov 19, 2026 8:53AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -264 లో.....మెకానిక్ షాపుకు కస్టమర్లు రావడం కోసం శైలూ తప్పుడు పనులు చేస్తుంటే కేశవ్ గట్టిగా మందలిస్తాడు. ఇలాంటి పనులతో సంపాదించిన డబ్బులు తీసుకుంటే నాకు మనశ్శాంతి ఉండదని చెప్తాడు. దీంతో శైలూ మళ్ళీ ఇలాంటి పిచ్చి పనులు చేయనని చెప్పేస్తుంది. అటు బస్ స్టాండ్ లో సత్యతో కన్నా పులిహోర కలుపుతుంటాడు. తనకు వాళ్ల అన్నయ్యలన్నా, వదిన అన్నా, ఇల్లు అన్నా ఎంతో ప్రేమ అని చెప్తాడు. నువ్వు కూడా మీ అన్నయ్యలాగే అమ్మాయిల వెంట పడుతుంటావా అని సత్య అడుగుతుంది. మా అన్నయ్య మంచోడు కాబట్టి మీ ఫ్రెండ్ ట్రాక్ తప్పుతుందని వెంటనే వెనక్కి తగ్గాడని చెప్తాడు. దీంతో వాళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్ గా మారిపోతారు. ఇంతలో ఆటో రావడంతో సత్య వెళ్లిపోతుంది.

 

మహాలక్ష్మీ రావడంతో కన్నా కూడా బైక్ ఎక్కుతాడు. దారిలో సత్య గురించి కన్నా ఎన్ని చెప్తున్నా మహా పట్టించుకోదు.. కోర్టు కౌన్సెలింగ్ గురించే ఆలోచిస్తుంటుంది. రాత్రికి ఇంట్లో అందరు కలిసి భోజనానికి కూర్చుంటుండగా మహాలక్ష్మీ బయటే ఉండటంతో చక్రి పిలుచుకుని రావడానికి వెళ్తాడు. నీకు మా ఇల్లు అన్నా, ఇంట్లో వాళ్లు అన్నా చాలా ఇష్టం ఏర్పడింది కదా అలాగే నేను అంటే కూడా ఇష్టమేనని నాకు తెలుసు అంటాడు. నేను ఏ అమ్మాయి వంక చూడకూడదని గుడిలో ప్రమాణం చేయించారని అంటాడు. నేను ఎవరి వైపు చూసినా మీరు అసూయపడుతున్నారని అనగానే మహాకు కోపం వచ్చి తిడుతుంది. ఓ అమ్మాయి నిస్సహాయతను ఆసరాగా తీసుకుని అబద్ధాలు చెప్పి తాళికట్టిన మిమ్మల్ని నేను ఎలా నమ్ముతానని అంటుంది. ప్రతిరోజూ ఏ అమ్మాయికి లైన్ వేద్దామా అని చూసే మీపై నాకు ఎలా ప్రేమ పుడుతుందని అంటుంది. రేపు మనం విడాకుల కౌన్సిలింగ్ కు వెళ్లాలని వార్నింగ్ ఇస్తుంది.

 

నేను పెళ్లికి ముందు అమ్మాయిల వెంట పడింది నిజమేనని కానీ ఇప్పుడు అలా చేయడం లేదని చక్రి చెప్పగా ఇలాంటి అబద్ధాలకోరును నేను ఎలా పెళ్లి చేసుకుంటానని ఆశపడుతున్నావని మహా మళ్ళీ తిడుతుంది. రేపు కోర్టు కౌన్సిలింగ్ కు వెళ్లాలి రెడీగా ఉండమని చెప్పి మహా వెళ్లిపోతుంది. రాత్రి అయినా మహా పని చేసుకుంటుండటంతో ఆమె కోసం బయటకు వెళ్లి టీ తీసుకొచ్చి ఇస్తాడు.. టీ ఇచ్చావని విడాకులు ఇవ్వకుండా ఉండనని అంటుంది. మహాలక్ష్మీతో కలిసి కోర్టు కౌన్సిలింగ్ కు చక్రి హాజరవుతాడు. అక్కడ కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్లు అడిగే ప్రశ్నలకు ఇద్దరూ మంచిగానే సమాధానం చెప్తారు, ఒకరంటే ఒకరికి ప్రేమ ఉన్నట్లు చెప్తారు. మరి ఇలాంటప్పుడు విడాకులు ఎందుకు కోరుకుంటున్నారని గట్టిగా నిలదీస్తారు. తమ పెళ్లి ఎలా జరిగిందో మహాలక్ష్మీ వివరిస్తుంది.. నాకు ఇతనిపై ఎలాంటి ప్రేమ లేకుండానే తాళి కట్టించుకోవాల్సి వచ్చిందని చెప్తుంది. దీంతో చక్రి, మహాలక్ష్మికి విడాకులు ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

SEO Keywords:

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com