Home

»

Tv News

Godavari Serial: మురళీ బొటిక్ ఓపెనింగ్‌.. జానూపై నందు ఫైర్!

Nov 19, 2026 8:26AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి' . ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -167 లో....జాను సంజయ్‌తో మీకు ఈగో ఎక్కువ, అలక వీడింది కదా మళ్లీ ఏది పడితే అది అనేయొచ్చని అంటే ఊరుకోను, మీ లిమిట్స్ లో మీరు ఉండండి అని అంటుంది. నీ గురించి తెలుసులేమ్మా దా గ్రేట్ శంకర్ నారాయణ కూతురు గారు అని సంజయ్ అంటే ఇంకొకటి మర్చిపోయారు బీఏ పాస్ అని జాను అంటుంది. మరోవైపు మురళీ షాప్ ఓపెనింగ్‌కి అందరు రెడీ అవుతారు. నందు రెడీ అయి వస్తుంది. నందు చీర చాలా బాగుందని మురళీ చెప్పడంతో గౌతమి, బామ్మ మురళీని ఏడిపిస్తారు. గౌతమి, కిన్నెరలు షాప్ ఓపెనింగ్ తర్వాత రెస్టారెంట్‌కి తీసుకెళ్లమని అంటారు. శారద జానుని కూడా పిలుద్దామంటే నందు అరుస్తుంది. జాను వస్తే నేను రాను.. ఆఫీస్‌కి వెళ్లిపోతా అంటుంది. జానుని పిలవమా అని కిన్నెర అడిగితే జాను లేదు ఏం లేదు, నందు నువ్వు వెళ్లి రెస్ట్ తీసుకోమని మురళీ పంపేసి తర్వాత కిన్నెరను తీసుకొని సంజయ్ ఇంటికి వెళ్తాడు.

 

కిన్నెరని లోపలికి పంపి మురళీ గుమ్మం దగ్గరే నిల్చొంటాడు, కిన్నెర సంజయ్‌ని పలకరిస్తుంది. మురళీ సంజయ్ దగ్గరకు వెళ్లి సర్ మీరు చేసిన సాయం వల్ల షాప్ ఓపెన్ చేశాం.. మీరు తప్పకుండా రావాలి సర్ అని అంటాడు. ఏంటి బావ నన్ను పిలవవా అని జాను అంటుంది. పిలిస్తే వెళ్లాలి, పిలవవా అని అడగకూడదని సంజయ్ అంటే ఎందుకు అడగను తను మా బావ, మా అక్క భర్త, మా మేనత్త కొడుకు అంటుంది. సంజయ్, జాను ఇద్దరినీ మురళీ పిలుస్తాడు.. జాను వస్తుంది, నాకు వీలు పడదని సంజయ్ అంటే అలా ఎలా కుదురుతుంది ఇద్దరూ వస్తారని పారు, శివుడు చెప్తారు.

 

బొటిక్ దగ్గరకు నందు వాళ్లు వెళ్లిపోతారు.. మొత్తం చూసి బామ్మ, శారద, గౌతమి, కిన్నెరలు సంతోషపడితే నందు మాత్రం తక్కువగా చూస్తుంది. ఏంటి అక్క నీకు సంతోషంగా లేదా అని గౌతమి అంటే చాలా హ్యాపీ అమ్మా, వారం పాటు తినను కూడా అంటుంది. ఇంతలో జాను, సంజయ్ వస్తారు. నందు, గౌతమిల ముఖం మాడిపోతుంది. నందు బామ్మతో ఈ మాత్రం దానికి నన్ను ఎందుకు పిలిచారని అంటుంది. జాను అందరిని పలకరిస్తుంది. జాను మురళీకి స్వీట్స్ అడిగితే సంజు మెల్లగా స్వీట్స్ ఎవరైనా అడుగుతారా అంటాడు. మా బావ నా ఇష్టం మీరు అద్దె భర్త అని అంటుంది. నందుని జాను పలకరిస్తే నిన్ను ఎవరు పిలిచారు.. బావ తనని పిలిస్తే నన్ను ఎందుకు పిలిచావని తన కడుపు మంట అంతా చూపిస్తుంది. మనం రావడం ఇష్టం లేనప్పుడు ఇక్కడ ఎందుకని జానూతో సంజయ్ అంటే బామ్మ, శారద ఉండమని చెప్తారు.

 

మురళీ సంజయ్‌తో మీ వల్లే నేను ఈ షాప్ పెట్టుకున్నా, మీరే రిబ్బన్ కట్ చేయండి అంటారు. అందరూ జాను, సంజయ్‌కి వెళ్లమని అంటారు. నందుకి బాస్ ఫోన్ చేయడంతో పక్కకి వెళ్తుంది. జాను, సంజయ్ ఇద్దరూ రిబ్బన్ కట్ చేస్తారు.. అందరూ లోపలికి వెళ్లి షాప్ చూస్తారు. నందుతో ఆకర్ష్ ఆఫీస్‌కి రెడీ అయ్యావా, వచ్చి పిక్ చేసుకోనా అంటే గుడిలో ఉన్నానని నందు అబద్ధం చెప్తుంది. మురళీ సంజయ్‌తో మొదటి కొబ్బరికాయ కొట్టించి అందరికీ స్వీట్స్ ఇస్తాడు.. సంజయ్ స్వీట్స్ తినను అంటే జాను వెళ్లి మీకు అఆలు వచ్చా అని చెప్పమని సంజయ్ నోటిలో పెట్టేస్తుంది. ఇంతలో నందు రావడంతో కిన్నెర.. అక్క సర్ నోటిలో స్వీట్ పెట్టిందని చెప్పగానే అందరికి మాయ చేయడం తనకి అలవాటే కదా అని నందు అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com