
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు' (Ye Devi Varamo Neevu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -121 లో పండుగ సందర్భంగా ఇంట్లో వాళ్లకి మనీష్ బయటకు వెళ్లి బట్టలు తీసుకొని వస్తాడు. వాటిని చూసి ఇంట్లో వాళ్లు హ్యాపీగా ఫీల్ అవుతారు. అదేంటి అంజలికి తీసుకొని రాలేదా అని రత్నం అనుకుంటుంది. ఆ తర్వాత అమ్మమ్మ మీ మనవడు తీసుకొని వచ్చిన చీర బాగుంది.. ఎంతైనా మీ మనవడు కదా అని అంజలి అంటుంది. నీకు తీసుకొని రాలేదు కదా అని రత్నం అంటే నాకు ఎందుకు అమ్మమ్మ, పనిమనిషి వాళ్లకి కూడా ఇస్తారా అని అంజలి అంటుంది.
మరోవైపు శంకర్ డల్ గా ఉంటాడు, కమల వెళ్లి..మీరు ఇక టెన్షన్ పడనవసరం లేదు.. భవితకి మనీష్ కి పెళ్లి చేస్తే భవిత వాటాకి వచ్చిన ఆస్తులు అమ్మేసి మన అప్పులు తీర్చుకోవచ్చని కమల అంటుంది. చెల్లి ఆకాశంలో ఉంది, మనం పాతాళంలో ఉన్నామని.. అలాంటప్పుడు మన మనీష్ కి ఎందుకు ఇస్తుందని శంకర్ అంటాడు. భవిత, మనీష్ ని ఇష్టపడుతుందని కమల అనగానే శంకర్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరోవైపు అంజలి పిండి వంటలు చేస్తూ మనీష్ గురించి ఆలోచిస్తుంది. అసలు బావ గురించి ఇలా ఆలోచించడం కరెక్టేనా అని అంజలి అనుకుంటుంది. వేరుశెనగలని మూడు గింజలు తీసుకొని ఒక గ్లాస్ లో వేయాలని, అది అందులో పడితే నేను ఆలోచించింది కరెక్ట్ అనుకుని వేస్తుంది. రెండు పడలేదు, మూడోది వేస్తుంటే మనీష్ వచ్చి పట్టుకుని తింటాడు.
అదేంటి అలా తినేశావని అంజలి అడుగుతుంది. నేను మా వాళ్లకి తీసుకొని వచ్చిన బట్టలు ఎలా ఉన్నాయని మనీష్ అడుగుతాడు. బాగున్నాయని అంజలి అంటుంది. మరి నువ్వు తెచ్చుకున్న చీర చూపించలేదని మనీష్ అనగానే నేను తెచ్చుకోలేదని అంజలి అంటుంది. నీ వెనకాల ఉంది ఏంటని మనీష్ అనగానే ఆ చీర చూసి అంజలి హ్యాపీగా ఫీల్ అవుతుంది. నేనే తీసుకొని వచ్చానని మనీష్ అంటాడు. తరువాయి భాగంలో గీతకి అంజలి పాలు తీసుకొని వస్తుంది. ఇప్పుడు పాలు తాగాల్సింది నేను కాదు నువ్వని గీత అనగానే అంజలి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






