Home

»

Tv News

Jayam Serial: ఆస్తులన్నీ తన పేరు మీదకి మార్చుకోవాలని వీరు ప్లాన్.. ‌జయ గదిలో వంశీ!

Nov 21, 2026 9:54AM

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం' (Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -432 లో రుద్ర, గంగ కలిసి గుడికి వెళ్తారు. అక్కడ మేనమామ దోషం అని చెప్పిన పంతులుని కలవడానికి వెళ్తారు. కానీ అక్కడ ఆలా చెప్పిన పంతులు ఉండడు. ఎందుకు సర్ అతన్ని కలవడమని గంగ అడుగుతుంది. నాకు తెలిసి అది ప్లాన్ ప్రకారం చేసినట్లు అనిపిస్తుందని రుద్ర అంటాడు. మరోవైపు రుద్ర ఇంట్లో లేని టైంలో వీరు ఆస్తులన్నీ తన సొంతం చేసుకోవడానికి ట్రై చేస్తాడు.

అందులో భాగంగా వీరు లాయర్ దగ్గరికి వెళ్లి విజయేంద్ర ప్రతాప్ పవర్ ఆఫ్ అటార్నీ ని నా సొంతం చేయాలని వీరు అంటాడు. దానికి లాయర్ సరే అంటాడు. వీరు లాయర్ దగ్గర నుంచి బయటకు వస్తాడు. తనకి ఎదురుగా ఇషిక ఉంటుంది. తనని చూసి వీరు షాక్ అవుతాడు. ఏంటి బ్రో హడావిడిగా వచ్చావని ఫాలో అయ్యానని ఇషిక అంటుంది. నీ దగ్గర దాచేది ఏముంది ఇషిక, ఆస్తులు అన్నీ నా సొంతం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నానని వీరు అనగానే అంత ఈజీ కాదు బ్రో, రుద్ర బావకి తెలియకుండా మావయ్య ఒక్క సంతకం కూడా పెట్టడని ఇషిక అంటుంది.

మరోవైపు గంగ ప్రాక్టీస్ చేస్తుంటే రుద్ర, రంగా పక్కన ఉంటారు. టాబ్లెట్ ఏం వేసుకోవాలో తెలియక పెద్దసారు బయటకు గంగని అడగడానికి వస్తుంటే కళ్లు తిరిగి పడిపోతాడు. అప్పుడే రుద్ర వస్తాడు. రంగా వెళ్లి వాటర్ తీసుకొని వస్తాడు. ఇంట్లో అందరు కంగారు పడుతారు. తనకి టాబ్లెట్ కరెక్ట్ గా ఇవ్వాలని డిసైడ్ అవుతారు. మరోవైపు ఇంట్లో ఎవరికి తెలియకుండా జయ దగ్గరికి వంశీ వెళ్తాడు. జయ గదిలో వంశీ ఉంటాడు. అప్పుడే అక్కడికి గంగ, రుద్ర వెళ్తారు. అయ్యో అన్నయ్య వచ్చాడా, ఇప్పుడు ఏం చేయాలని వంశీ టెన్షన్ పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com