
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -169....లో శివుడికి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. బామ్మ చాలా ఏడుస్తుంది. జాను ధైర్యం చెప్తుంది. సంజు కూడా టెన్షన్ పడతాడు. ఇక డాక్టర్ మాట్లాడాలని సంజుని పిలుస్తాడు. సంజు, జాను ఇద్దరూ డాక్టర్ ని కలవడానికి వస్తారు. మరోవైపు నందు ఆఫీస్ కి లేటుగా వెళ్లినందుకు టెన్షన్ పడుతుంది. ఆఫీస్ బాయ్ నందుతో టెన్షన్ ఎందుకు మేడమ్, మీరు లేటుగా కాదు చెప్పాపెట్టకుండా రెండు మూడు రోజులు రాకపోయినా సర్ ఏం అనరని అంటాడు. మీరు బాస్ కి స్పెషల్ మేడమ్ అని అంటాడు. అందరు నందుని చూసి నవ్వుకుంటారు. దాంతో నందు ఆఫీస్ బాయ్ ని తిడుతుంది. ఇంకోసారి ఎవరి గురించి ఇలా మాట్లాడొద్దని వార్నింగ్ ఇస్తుంది. ఇంతలో ఆకర్ష్ వచ్చి నందుని తన క్యాబిన్ కి రమ్మని సీరియస్ గా చెప్తాడు.
మీ తాతయ్య గారికి వయసు అయిపోతుంది.. హార్ట్ కూడా వీక్ గా ఉందని, ఆయనకు ఈ వయసులో మందుల కంటే సంతోషమే ముఖ్యమని సంజయ్, జానూలతో డాక్టర్ అంటాడు. ఆయన ఏమైనా అడిగినా కావాలని చెప్పినా కాదనొద్దని అంటుంది. దాంతో జాను నల్లపూసల కార్యక్రమం సంజయ్ వద్దు అన్నాడని అంటుంది.. అదేదో చేసేయండి, పెద్దాయన మనసు కష్టపెట్టొద్దని చెప్పి ఇంటికి తీసుకెళ్లి ప్రశాంతంగా ఉంచమని డాక్టర్ అంటారు. జాను సంజయ్ తో ఇప్పుడేంటి నల్లపూసల గురించి అని అంటే నీకు బాగా సరదాగా ఉందని సంజయ్ అంటే నా కోసం కాదు తాతయ్య కోసం చేద్దామని జాను అంటుంది. ఆకర్ష్ నందుని పిలిచి ఈ రోజు అలకనంద టైలర్ షాప్ చూశానని, అక్కడికి వెళ్లాను కూడా అని అంటాడు. నీ పేరు మీద మీ బావ టైలర్ షాప్ ఓపెన్ చేశాడా, నీ పేరు మీద షాప్ పెట్టాడంటే నీకు మీ బావకి ఏదో ఉందని అంటాడు. చూడు అలకనంద.. నేను నిన్న చాలా నమ్మాను, ఉద్యోగిగా చూడలేదని, ప్రతీ మనిషిని జీవితంలో ఎప్పుడో ఒకసారి కలుస్తారని ఆకర్ష్ అంటాడు.
వాళ్లని చూడగానే ఎన్నో జన్మల బంధం ఉన్నట్లు అనిపిస్తుందని, నాకు నిన్ను చూడగానే అలా అనిపించిందని కానీ ఇలా చేశావ్ ఏంటని అంటాడు. దానికి నందు మా బావకి నేను అంటే ఇష్టం సర్ అని అంటే ఇష్టం ఉంటే ఓకే కానీ అంతకు మించి ఏదో ఉందని ఆకర్ష్ అంటాడు. మా ఇంట్లో ఎవరు ఏం చేసినా నా పేరుతోనే పెడతారని కలిసొస్తుందని నమ్మకమని నందు అంటుంది. జాను ఇంటికి వెళ్లాక నల్లపూసల తంతు చేద్దామని సంజయ్ కి అంటుంది. ఆడపిల్లలు మనసు అర్థం చేసుకున్న వాడు కావాలని అనుకుంటారని చెప్తుంది. సరే తాతయ్య కోసం ఓకే అన్నానని, ప్రాసెస్ ఏంటని సంజు అంటే మీరు మళ్లీ నా మెడలో తాళి కట్టాలని జాను అంటుంది. దేవుడా మళ్లీ తాళి కట్టాలా అని సంజయ్ అంటే మీకే అలా ఉంటే మళ్లీ మళ్లీ తాళి కట్టించుకునే నాకు ఎలా ఉంటుందని జాను కన్నీరు పెట్టుకుంటుంది. ఆకర్ష్ నందుకి ఓ ఫైల్ ఇచ్చి సంతకం పెట్టమని అంటాడు, ఏంటి సర్ జాబ్ నుంచి తీసేస్తారా అని నందు అంటే నీ హ్యాండ్ లక్కీనా కాదా అని ఓ కొటేషన్ నీ పేరు మీద పంపిస్తున్నానని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






