
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-120 లో మనీష్ కి జలుబు అయిందని అంజలి వేడి కాఫీ తీసుకొని వస్తుంది. ఇద్దరూ ఒక్క కాఫీని షేర్ చేసుకుంటారు. అదంతా కమల చూస్తుంది. మనీష్ వెళ్ళాక అంజలి దగ్గరికి కమల వచ్చి నువ్వు పనిమనిషివి అన్న విషయం మర్చిపోయావా.. నా కొడుకు స్థాయి ఏంటి నీ స్థాయి ఏంటని కోప్పడుతుంది. నువ్వు ఇంకోసారి ఇలా చేస్తే బాగుండదని వార్నింగ్ ఇస్తుంది. దాంతో అంజలి బాధపడుతుంది. అంజలికి వార్నింగ్ ఇవ్వడం భవిత చూసి అత్తయ్య కూడా మన పార్టీనే, నేను బావని ప్రేమిస్తున్న విషయం అత్తయ్యకి చెప్తానని భవిత అనుకుంటుంది. మనీష్ కి ఆవిరి వద్దని కమల అన్నా, బాధ చూడలేక అంజలి వెళ్లి ఆవిరి పట్టిస్తుంది. మరోవైపు భవిత బావ అంటే నాకు ఇష్టం, పెళ్లి చేసుకుంటానని కమలకి చెప్తే కమల హ్యాపీగా ఫీల్ అవుతుంది.
ఆ తర్వాత శంకర్, కమల వాళ్లకి బట్టలు కొనాలని గీతతో బాను అంటాడు. అప్పుడే శంకర్ వచ్చి అవసరం లేదు మేమే మీకు కొని తీసుకొచ్చామని అంటాడు. ఆ తర్వాత గీత బంజారా హిల్స్ లోని ల్యాండ్ అమ్మాలి అనుకుంటున్నామని శంకర్ అనగానే వద్దు అన్నయ్య, అందులో నాన్న సమాధి ఉందని గీత అంటుంది. దాంతో శంకర్ డిసప్పాయింట్ అవుతాడు. నీకు డబ్బు అవసరం ఉంటే చెప్పు అన్నయ్య అని గీత అంటుంది. అదేం లేదని కమల అన్నమాటలు గీత గుర్తుచేసుకుంటుంది. శంకర్ కి డబ్బు అవసరం ఉందని గీతకు అర్థమవుతుంది.. కానీ తండ్రి సమాధి ఉన్న స్థలాన్ని అమ్మడానికి గీత ఒప్పుకోదు. కుటుంబంలో డబ్బు ఇబ్బందులు పెరుగుతున్నాయని శంకర్ బాధపడతాడు. గీత తన అన్నకి ఎలా సహాయం చేయాలా అని ఆలోచనలో పడుతుంది.
తరువాయి భాగంలో శంకర్ తో కమల మాట్లాడుతుంది. మనీష్, భవితకి పెళ్లి చేయాలని అంటుంది. భవిత వాటా వస్తే అప్పులు అన్నీ తీర్చేయొచ్చని కమల ప్లాన్ చెప్తుంది. అంజలి, మనీష్ ల మధ్య పెరుగుతున్న చనువుని కమల ఎలా ఆపాలని ఆలోచిస్తుంది. భవిత తన ప్రేమ విషయాన్ని బయటపెట్టేందుకు సిద్ధమవుతుంది. మనీష్ మనసులో అంజలి ఉందని కమలకి తెలియదు. ఇంట్లో పెళ్లి ప్రస్తావనతో కొత్త ట్విస్ట్ మొదలవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






