
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-431 లో ప్రీతీ బాబు బాగా ఏడుస్తాడు. ఎవరు ఊకోబెట్టినా ఊరుకోడు. వాడు రుద్ర కోసం ఏడుస్తున్నాడని పెద్దసారు అంటాడు. ఊరుకోండి మావయ్య గారు, మీకంటే రుద్ర బావ అంటే అభిమానం, వాడు చిన్న పిల్లాడు వాడికేం తెలుసని వీరు అంటాడు. అది కాదు వీరు, ఇందాక గంగ వచ్చి ఎత్తుకున్నప్పుడు బాబు సైలెంట్ అయ్యాడు.. తన వెనకాలే రుద్ర వస్తాడని అనుకొని ఉంటాడు.. రాకపోయేసరికి మళ్లీ ఏడవడం మొదలు పెట్టాడని పెద్దసారు అంటాడు. బాబుకి రుద్ర అంటే ఉన్న కనెక్షన్ ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. బాబు ఏడుపు ఆపడం లేదని ఇంట్లో అందరూ కంగారు పడతారు. రుద్ర లేకుండా బాబు ఉండలేడని పెద్దసారు బాధపడతాడు.
అంతలో బాబు కోసం రుద్ర బయట నుంచి పాట పాడుతాడు. దాంతో బాబు నిద్రపోతాడు. బాబుకి రుద్ర అలా కనెక్ట్ అవ్వడం చూసి శకుంతల ఓర్వలేకపోతుంది. బాబుని ప్రీతీ, శకుంతలకి ఇచ్చి గంగ రుద్ర దగ్గరికి వెళ్తుంది. అన్నయ్య మీరు ఇలా దూరంగా ఉండడం నాకు ఇష్టం లేదని ప్రీతీ అంటుంటే మీ కోసం ఏదైనా చేస్తానని రుద్ర అంటాడు.. దాంతో ప్రీతీ ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత బావ అలా పాడగానే బాబు నిద్రపోయాడు, అలా ఎలా అని రంగా అనగానే వాడికి రోజూ అదే పాట పాడి నిద్రపుచ్చానని రుద్ర అంటాడు. రుద్ర పాటతో బాబు నిద్రపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. రుద్ర, బాబు మధ్య ఉన్న ప్రేమను చూసి ప్రీతీ కంటతడి పెడుతుంది.
ఆ తర్వాత రుద్ర డల్ గా ఉంటే తనని డైవర్ట్ చేయడానికి గంగ ట్రై చేస్తుంది. సర్ నాకు నిద్ర రావడం లేదు.. నాకు కూడా జోల పాడి పడుకోబెట్టండి అని గంగ అనగానే పందిలా నిద్రపోతావ్. నీకు నిద్ర రావడం లేదా అని రుద్ర అంటాడు. మరుసటి రోజు గంగని తీసుకొని రుద్ర గుడికి వెళ్తాడు..మేనమామ దోషం ఉందని చెప్పిన పంతులితో మాట్లాడాలని అనుకుంటాడు. కానీ అక్కడ ఆ పంతులు లేకపోయేసరికి రుద్ర డిసప్పాయింట్ అవుతాడు. గంగ రుద్రని ఓదార్చేందుకు ప్రయత్నిస్తుంది.. రుద్ర మాత్రం బాబు గురించే ఆలోచిస్తుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)

