
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి' ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -168 లో మురళీ నందుకి లక్ష్మీ దీపం వెలిగించమని చెప్తే అది కూడా మీ మరదలితో చేయించుకోమని నందు ఆఫీస్ కి వెళ్లిపోతుంది. నందు మాటలు పట్టించుకోవద్దని శారద సంజయ్ కి చెప్తుంది. ఇక జాను, సంజయ్ కూడా బయల్దేరుతారు. గౌతమి, కిన్నెరలు దీపం పెడతారు. మురళీ బామ్మ, శారదల ఆశీర్వాదం తీసుకుంటారు. జాను కారులో పాటలు పాడుతుంటే సంజయ్ జానుతో నీకు బాధే లేదా, మీ అక్క అన్ని మాటలు అంటే ఊరుకున్నావని అంటాడు. మీ అక్కకి చాలా పొగరు కదా అని అంటే కొంచెం అని జాను అంటుంది. కొంచెం కాదు చాలా అని సంజయ్ అంటాడు. మీ ఇంట్లో అందరికి పొగరే కదా అని ఇద్దరు మాటామాటా అనుకుంటారు.
మీ అమ్మకి కోపం వచ్చినట్లుంది.. మీ అక్క పొగరు చూసి నాకు కోపం వచ్చిందని సంజయ్ అంటే తమరికి అంతా మీ అమ్మ గారి కోపమే అని జాను అంటుంది. దాంతో సంజయ్ షాక్ అయి కారు ఆపేస్తాడు. ఇంకోసారి ఆ మాట అంటే మర్యాదగా ఉండదని అంటాడు. షటప్ అమ్మ అనే పదం నా ముందు అనొద్దని కోపంగా జాను హ్యాండ్ బ్యాగ్ కిందకి విసిరేస్తాడు. జానుని కిందకి దిగమని అంటాడు. జాను బ్యాగ్ ని చూసిన దొంగ బ్యాగ్ పట్టుకొని పారిపోతాడు, నా బ్యాగ్ పట్టుకోమని జాను అంటే సారీ నేను వెళ్లనని సంజు అంటాడు. దొంగ వచ్చి కారు మంచి చీర చూసి ఏదో అనుకున్నా, బ్యాగ్ లో దువ్వెన, లిప్ స్టిక్, రుమాలే ఉన్నాయని తిడతాడు. ఇదిగో వెయ్యి రూపాయలు తీసుకో రాఖీ కట్టావు అనుకుంటా అని జానుని తిట్టేసి వెళ్లిపోతాడు.. సంజు నవ్వుకుంటాడు.
నందు గురించి ఆలోచిస్తూ ఆకర్ష్ ఆఫీస్ కి వెళ్తూ అలకనంద టైలర్ షాప్ బోర్డు చూసి ఆగుతాడు. బయట ఉన్న మురళీని చూసి అలకనంద బావ కదా అనుకుంటాడు. బోర్డు మీద అలకనంద పేరు ఉంది.. తనేదో పెళ్లాం అయినట్లు పేరు రాసుకున్నాడని అనుకుంటాడు. ఎక్కడో ఏదో మిస్సింగ్, తెలుసుకుంటానని ఆకర్ష్ అనుకుంటాడు. జాను, సంజయ్ ఇంటికి వస్తారు. శివుడు, పారులు నల్లపూసల తంతు చేసేద్దాం అనుకుంటారు. ఓపెనింగ్ ఎలా జరిగిందని అడిగితే అబ్బో ఏం జనం, ఏం హడావుడి అని సంజయ్ అంటాడు. స్వీట్ తిన్నాడని జాను చెప్తే అందరూ షాక్ అవుతారు. మేం దగ్గరుండి నల్లపూసల తంతు చేయాలనుకుంటున్నామని శివుడు అంటే అక్కర్లేదని సంజయ్ అంటాడు. అన్నిటికి వాళ్లకి సపోర్ట్ చేస్తావేంటి, ఇప్పుడు నల్లపూసలు అంటారు రేపు పిల్లలు అంటారని సంజయ్ వెళ్లిపోతుంటే శివుడికి హార్ట్ ఎటాక్ వస్తుంది. అందరు కంగారుపడి హాస్పిటల్ కి తీసుకెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






