Home

»

Tv News

Ye Devi Varamo Neevu: షాక్ ఇచ్చిన శంకర్, కమల.. గీతకి డౌట్!

Nov 17, 2026 10:00AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ - 117 లో.. రాకీతో రోహిత్ ఫోన్ మాట్లాడుతుంటే అంజలి వస్తుంది. భయంతో ఫోన్ కట్ చేస్తాడు. ఆ తర్వాత రాకీ ఎలాగైనా ఇంటికి రావాలని ప్రీతీకి కాల్ చేస్తాడు. ఫ్రెండ్స్ అందరూ దీపావళికి ఇంటికి వెళ్లారని అంటాడు. నువ్వు కూడా రా అన్నయ్య అని ప్రీతీ చెప్తుంది. సరే కానీ మావయ్య వాళ్లకి రానని చెప్పానని రాకీ అనగానే అప్పుడే భాను వస్తాడు. నువ్వు కూడా పండగకి రా అల్లుడు అని భాను అనగానే సరే మావయ్య అంటాడు.

 

అప్పుడే అంజలి వచ్చి.. నేను కూడా మాట్లాడుతానని ఫోన్ తీసుకుని ఏంటి బాబు మీకు బాగా చదువుకోవడం ఉంది.. వీలు అవ్వదా అని రివర్స్ డ్రామా ప్లే చేస్తుంది. అంత చదివేది ఉంటే వద్దురా అని భాను పక్కన ఉండి అంటాడు. విన్నారు కదా మీరు అక్కడే ఉండి చదువుకోండి అని అంజలి అంటుంది. దీంతో అంజలిపై రాకీకి బాగా కోపం వస్తుంది.

మరోవైపు అంజలి, మనీష్ క్లోజ్ గా ఉన్నది గుర్తుచేసుకుని భవిత కోపంగా ఉంటుంది. తన ఫ్రెండ్స్ కి కాల్ చేస్తే అసలు లిఫ్ట్ చేయరు.. సాంగ్స్ పెట్టుకుని వింటుంటే ఇంత సౌండ్ ఆ అని ప్రీతీ, కృష్ణ సాంగ్స్ ఆపుతారు. దీంతో భవిత వాళ్లపై సీరియస్ అవుతుంది.

మరోవైపు ఫారెన్ నుంచి శంకర్, కమల వస్తారు. ఏవండీ మీరు డల్ గా ఉంటే గీతకి మన సిచువేషన్ అర్థమవుతుంది.. మామూలుగా ఉండండి అని కమల అంటుంది. వాళ్లు ఇద్దరూ లోపలికి వెళతారు. లోపలికి వెళ్లగానే అంజలి కనిపిస్తుంది.. నమస్కారం అని అంజలి అనగానే నీ నాటకాలు నా దగ్గర కాదని కమల చిరాకుపడుతుంది. అందరు వాళ్లని చూసి సర్ప్రైజ్ ఫీల్ అవుతారు.. ఏంటి ఇంత సడెన్ గా అని గీత అంటుంది.. మీకు సర్ప్రైజ్ ఇద్దామని కమల అంటుంది. శంకర్ ఎప్పటిలాగే లేడని మనీష్ కి అలాగే గీతకి డౌట్ వస్తుంది. అన్నయ్య ఏదైనా ప్రాబ్లమా అని గీత అడిగితే అదేం లేదని శంకర్ అంటాడు. ఆ తర్వాత గీత లోపలికి వెళ్లాక మా అన్నయ్య ఎందుకో డల్ గా ఉన్నాడని గీత అనగానే అదేం లేదని భాను అంటాడు. రత్నంతో వాళ్లు ఎందుకు ఇంత సడెన్ గా వచ్చారని అంజలి అడిగితే వాళ్లు అంతే ఎప్పుడూ సర్ ప్రైజ్ ఇస్తారని రత్నం అంటుంది. తరువాయి భాగంలో అంజలి, మనీష్ పక్కపక్కన కూర్చుని అన్నం తింటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com