Home

»

Tv News

Podarillu Serial: కొడుకు కోసం ఎమోషనల్ అయిన నారాయణ.. కరిగిన కన్నా మనసు!

Nov 17, 2026 10:03AM

స్టార్ మా టీవీలో ప్రేక్షక ఆదరణతో దూసుకుపోతున్న సీరియల్ 'పొదరిల్లు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -262 లో.. దీపావళి పండుగకు అందరు ఆనందంగా టపాసులు కాల్చి ఇంట్లోకి వెళ్లగా కన్నా మాత్రం ఇంకా బయటే ఉండి టపాసులు కాలుస్తుంటాడు. నారాయణ వచ్చి జాగ్రత్త అని చెప్పగా కన్నా తండ్రిని లెక్కచేయకుండా నీ పని నువ్వు చూసుకోమని నిర్లక్ష్యంగా మాట్లాడతాడు. అప్పుడే నిప్పురవ్వలు వచ్చి టపాసులపై పడటంతో ఒక్కసారిగా అవన్నీ పేలిపోతాయి. పెద్దఎత్తున మంటలు రావడంతో కన్నా భయపడిపోతాడు.

 

వెంటనే నారాయణ అక్కడికి పరుగెత్తుకుంటూ వచ్చి కన్నాకు ఏం కాకుండా గుండెలకు హత్తుకుంటాడు. నిప్పురవ్వలు కొడుకుపైకి రాకుండా అడ్డుగా నిలబడతాడు. దీంతో నారాయణ వీపుకి నిప్పురవ్వలు తగిలి గాయాలవుతాయి. అందరూ పరుగెత్తుకుంటూ వచ్చి ఇద్దరిని పక్కకు తీసుకెళ్తారు. కన్నాకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. నేను అందుకే అన్ని టపాసులు ఒకేసారి తీసుకెళ్లవద్దని చెప్పానని కన్నాని అరుస్తాడు మాధవ్.

బయటకు వెళ్లిన మహాలక్ష్మి నువ్వు ఏమైనా సూపర్ మ్యాన్ అనుకుంటున్నావా అని నారాయణని తిడుతుంది. అంత పెద్ద ఎత్తున టపాసులు పేలుతుంటే నువ్వు ఎందుకు వెళ్లావని నిలదీస్తుంది. నా కొడుకు మంటల్లో చిక్కుకుంటే కాపాడే బాధ్యత నాకు లేదా అని నారాయణ అంటాడు. ముగ్గురు అన్నయ్యలు ఉన్నారని మహా చెప్పగా, వాళ్లకన్నా ముందు ఈ నాన్న కూడా ఉన్నాడని, వాడిని చిన్నప్పుడే వదిలిపెట్టలేదు.. ఇప్పుడు 20 ఏళ్లు వచ్చాయని ఆపదలో ఉంటే వదిలేసి ఎలా వెళ్తానని నారాయణ అంటాడు.

ఈ మాటలు కన్నా వింటున్నాడని చూసి మహాలక్ష్మి మరింత రెచ్చిపోతుంది. వాడు అసలు నిన్ను తండ్రిగానే చూడటం లేదని అలాంటి వాడి కోసం ప్రాణాలు రిస్క్ లో పెట్టుకోవడం ఎందుకని అంటుంది. వాడు నన్ను తండ్రిగా చూడకపోయినా నేను వాడిని కొడుకుగానే చూస్తున్నానని.. అవసరమైతే వాడి కోసం అగ్నిగుండంలో దూకమన్నా దూకుతానని నారాయణ అంటాడు. ఆ మాటలు విన్న కన్నా సిగ్గుతో లోపలికి వెళ్లిపోతాడు. లోపలికి వచ్చిన మహా కన్నాని తిడుతూ.. నువ్వు ఆయన్ని తండ్రిగా కూడా కాదు కనీసం మనిషిగా కూడా చూడకపోయినా నీ కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడని అంటుంది. మీ అమ్మకు చాలా ఇబ్బందులు ఉన్నాయని వెళ్లిపోయిందని, దీనికి ఆయన కారణం కాదని చెప్తుంది. ఆ మాటలు విన్న కన్నా మనసు కరిగిపోతుంది. నారాయణ దెబ్బలకు మందు రాయమని కన్నా తీసుకొచ్చి ఇవ్వడంతో అందరు సంతోషపడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com