.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-165 లో.. నందు ఆకర్ష్ ని కొట్టినందుకు సారీ చెప్పడానికి వెళ్తుంది. సారీ సర్ మీరు నన్ను కాపాడటానికి కొంగు పట్టి లాగారని తెలీదని చెప్తుంది. దానికి ఆకర్ష్ నేను అక్కడి నుంచి వచ్చేశానని కోపం వచ్చిందనుకుంటున్నావా, నీ ఒంటి మీద కాలిపోయిన చీర ఉండకూడదని నేను వెళ్లి చీర కొనుక్కొని వచ్చా, ఆఫీస్ స్టాఫ్ కి చెప్పొచ్చు కానీ వాళ్లకి చెప్తే మన మధ్య ఏదో ఉందని అనుకుంటారని అందుకే నేనే వెళ్లానని చెప్పి నందుకి చీర ఇస్తాడు. తర్వాత ఓ గోల్డ్ లాకెట్ గిఫ్ట్ ఇస్తాడు. నందు తీసుకోనని చెప్పడంతో ఫీలవుతానని చెప్పి తీసుకోమంటాడు. చీర కట్టుకుని రమ్మని చెప్తే నందు చీర కట్టుకుని వస్తుంది.. ఆకర్ష్ చూసి ఫ్లాట్ అయిపోతాడు.
జాను పూలు తీసుకుని వెళ్తూ సంజయ్ ని ఢీ కొట్టి పడిపోబోతే సంజయ్ పట్టుకుంటాడు. ఇద్దరూ ఒకర్ని ఒకరు చూసుకుని ఉండిపోతారు. తర్వాత జాను దూరం జరుగుతుంది. సంజయ్ జానుతో పడిపోతా అంటావ్ కానీ నన్ను పట్టుకోవడానికి నీకు అంత పొగరా అని అంటాడు. జాను ఏం మాట్లాడకుండా వెళ్లిపోతుంది.
నందు ఇంటికి వస్తుంది. నందుని బామ్మ చూసి ఆఫీస్ కి వెళ్లినప్పుడు ఒక చీర కట్టుకున్నావ్ ఇప్పుడు మరో చీరతో వచ్చావేంటని అడుగుతుంది. మురళీ కూడా.. ఏంటి నందు చీర మార్చేశావని అడుగుతాడు. రోడ్డు మీద పేదవాళ్లకి చీరలు పంచుతుంటే వెళ్లి తెచ్చుకున్నా అనడంతో సెటైర్లు ఆపి ఏమైందో చెప్పమని బామ్మ అంటే చీర కాలిపోయిందని నందు చెప్తుంది. తర్వాత మురళీ నందుకి దిష్టి తీస్తాడు. బామ్మ మనసులో మురళీ, నందుల కాపురం ఏం అవుతుందోనని భయం వేస్తుందని అనుకుంటుంది.
కిన్నెర సాయంతో సంజయ్.. కిన్నెర సంజయ్ దగ్గరకు వచ్చి ఇంట్లో ఎవరూ లేరని తెలిసి సంజయ్ ని బావగారు అంటుంది. బావ ఏంటని సంజయ్ అంటే ఇక్కడ మీరు నేను తప్ప ఎవరు లేరు కదా మన రూల్ ప్రకారం బావ అని పిలిచా అంటుంది. కాసేపు మాట్లాడి ప్రసాదం ఇస్తుంది. జాను దూరం నుంచి చూస్తుంది. సంజయ్ కిన్నెరతో మీ అక్క నాతో మాట్లాడటం లేదు ఏమైనా ఐడియా ఇవ్వమని అడుగుతాడు. కిన్నెర చెవిలో ఐడియా చెప్తుంది.
జానుకి సంజయ్ సారీ.. జాను ఉన్న దగ్గర సంజయ్ సారీ అంటూ చాలా పేపర్స్ మీద రాసి వాటిని జాను చూసేలా వేలాడదీస్తాడు. జాను దగ్గరకు వచ్చి.. మనం ఎందుకు కలిశామో తెలీదు.. ఎవరి అవసరాల వల్ల వాళ్లం నటిస్తున్నాం.. కలిసి ప్రయాణిస్తున్నాం.. ఈ ప్రయాణం తాత్కాలికం అయినా సూర్యని నీతో చూసినప్పుడు.. నాకు చెప్పకుండా డబ్బు ఇచ్చినప్పుడు అలా అనేశా క్షమించు.. దీపావళి అంటే చీకటి పోయి వెలుగు వచ్చే పండగ..మన జీవితంలో కూడా అలా జరగాలనుకుంటున్నానని చెప్తాడు. జాను ఏం మాట్లాడకుండా వెళ్లిపోతుంది. తర్వాత జాను పూజ చేస్తుంటే సంజయ్ అక్కడే ఉంటాడు. హారతి తీసుకుని జానుతో నటకుమారి నీతో కొంచెం పని ఉందిరా అని చెప్పి కళ్లు మూసి బయటకు తీసుకెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
