
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు' (Ye Devi Varamo Neevu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ 113 లో.. మనీష్ ని అంజలి ఆటపట్టించడం చూసి రత్నం హ్యాపీగా ఫీల్ అవుతుంది. నువ్వు మనీష్ ద్వారా ఈ కుటుంబంలో ఒక సభ్యురాలు అవుతావని అనిపిస్తోందని రత్నం అనగానే అంజలి మురిసిపోతుంది. మనీష్ ని ఊహించుకుంటుంది. మరోవైపు అంజలి వల్ల ఇంట్లో నుంచి బయటకు రావడంతో రాకీ చాలా కోపంగా గోడను కొడుతూ ఉంటాడు. ఇది రెంట్ హౌస్, ఓనర్ చూస్తే ఈ రూమ్ కూడా ఉండదని తన ఫ్రెండ్స్ అంటారు.
మందు కోసం డబ్బు ఇవ్వరా అని రాకీ తన ఫ్రెండ్స్ ని అడిగితే, డబ్బు లేదని వాళ్లు అంటారు. కనీసం వంద రూపాయలైనా ఇవ్వండిరా అని అడిగినా లేదని చెప్తారు. అప్పుడే రోహిత్ బిర్యానీ తీసుకొని వస్తాడు. థాంక్స్ రా అని రాకీ అనగానే ఇంకెప్పుడూ నాతో మాట్లాడకు, అంజలి చూస్తే బాగోదు.. నీతో మాట్లాడొద్దని నాకు వార్నింగ్ ఇచ్చిందని రోహిత్ చెప్పి వెళ్లిపోతాడు. పాపం వాడు అంత భయపడుతున్నాడంటే వాడిని ఎంత భయపెట్టిందోనని రాకీ అనుకుంటాడు.
మరోవైపు భవిత పార్టీలో ఫుల్ గా డ్రింక్ చేస్తూ ఉంటుంది. ఎందుకు ఇంతలా తాగుతున్నావని తన ఫ్రెండ్ అడిగితే నన్ను అంజలి టార్చర్ చేస్తోంది.. మా బావతో క్లోజ్ గా ఉంటోందని భవిత చెప్తుంది. మీ బావ అందంగా ఉంటాడు.. ఆ మాత్రం లైన్ వేయదా, నువ్వు జాగ్రత్త పడు అని ఫ్రెండ్ సలహా ఇస్తుంది. ఆ తర్వాత భవిత గోడ దూకి ఇంట్లోకి వస్తుంది.అంజలికి ఎదురుపడుతుంది. ఏంటి డ్రింక్ చేశావా అని అంజలి అడగగానే అవును అయితే ఏంటి, నువ్వు ఏం ప్లాన్ తో మా ఇంటికి వచ్చావో నాకు తెలుసని భవిత అంటుంది. దీంతో తాను గీత కూతురు అన్న విషయం తెలిసిపోయిందా అని అంజలి టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
