Home

»

Tv News

Podarillu Serial: నారాయణని అవమానించిన కన్నా..‌షాప్ పేరు షాక్ లో శైలు!

Nov 12, 2026 3:17PM

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు' (Podarillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ - 258లో.. నారాయణకు ఇంపార్టెన్స్ ఇవ్వడం, బట్టలు పెట్టడం, షాప్‌కి రమ్మనడంపై కన్నా కోప్పడతాడు. అసలు అతను ఏమైనా పట్టించుకున్నాడా, అలాంటి శుభకార్యానికి ఏం చేయాలన్న పూర్తి అర్హత పెద్దన్నయ్యకే ఉంది.. అతన్ని చూస్తేనే అసహ్యంగా ఉంది.. అలాంటి వాడికి కొడుకుగా ఎందుకు పుట్టానా అనిపిస్తుందని కన్నా అంటాడు. మహాలక్ష్మి కన్నా అని వారిస్తుంది. ఆయన వస్తే నేను రానని కన్నా అంటాడు. ఇది శుభకార్యం, అందరం ఉంటేనే బాగుంటుంది, ఇంటికి పెద్దవాడు కాబట్టి నాన్నతో రిబ్బన్ కట్ చేయిద్దామనుకుంటున్నామని మాధవ అంటాడు. ఆయనతో రిబ్బన్ కట్ చేయిస్తే నేను రానని కన్నా అంటే రాకని మహాలక్ష్మి రివర్స్ అవుతుంది. బతిమిలాడుతుంటే ఓవరాక్షన్ చేస్తున్నావని, ఇది మీ కేశవ అన్నయ్య మొదటి విజయమని, దాన్ని నాశనం చేయకని కన్నాకు మహా వార్నింగ్ ఇస్తుంది. దాంతో కన్నా ఆలోచనలో పడతాడు.

మరోవైపు మహా డిజైన్ గీస్తుంది. చాట్ జీపీటీని తన డిజైన్ అమ్మడంలా కాకుండా సర్వీస్ గురించి చెప్తున్నట్లుగా ఉండాలని, దానికోసం ప్రొఫెషనల్ మెయిల్ ఎలా రాయాలో అడిగి తీసుకుంటుంది మహాలక్ష్మి. మరుసటి రోజు ఉదయం అంతా రెడీ అవుతారు. మహాను చీరలో చూసి చక్రి ఫ్లాట్ అవుతాడు. చీరలో మీరు చాలా బాగున్నారని అంటాడు. మహాలక్ష్మి మహాలక్ష్మిలానే ఉందని మాధవ, మా అమ్మ గుమ్మడికాయతో దిష్టి తీయాలని నారాయణ అంటారు. మనీషాను చీరకట్టులో చూసి పెద్ది ఫిదా అవుతాడు. దేవుడికి మహా పూజ చేసి హారతి ఇస్తుంది. మహాను చూసి నారాయణ మురిసిపోతాడు. మరోవైపు చక్రి చాట్ జీపీటీని నా భార్య మహా కోసం స్పెషల్‌గా ప్లాన్ చేయాలని, వివాహబంధంలో కంఫర్ట్‌గా ఉండేందుకు ఎలా చేయాలని అడుగుతాడు‌. చాట్ జీపీటీ కొన్ని ఐడియాలు ఇస్తుంది.

నారాయణకి మామిడితోరణాలు కట్టమని మహాలక్ష్మి పని చెప్తుంది. అక్కడికి వచ్చిన చక్రితో కన్నా మనసు మార్చేస్తానని అడుగుతుంది. దాంతో చక్రి ఇంట్లో అందరిని పిలిచి పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలంటాడు. కన్నా చేత నారాయణ కాళ్లకు దండం పెట్టించాలని ప్లాన్ చేస్తాడు. మాధవ, మనీషా నారాయణ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. చక్రి ఒక్కడే తండ్రి ఆశీర్వాదం తీసుకుంటాడు. కేశవ ఆశీర్వాదం తీసుకుంటూ తండ్రిని అన్న మాటలు తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుని నారాయణ కాళ్లు పట్టుకుని ఏడుస్తాడు. అంతా షాక్ అవుతారు. ఇప్పుడు కన్నాను కూడా ఆశీర్వదించమని చక్రి అంటే, కన్నా ముందుకు వచ్చి నాకు అమ్మ, నాన్న, దేవుడు అన్నీ నువ్వే, నువ్వు ఆశీర్వదిస్తే చాలన్నయ్యా అని మాధవ కాళ్లపై పడి చక్రి ప్లాన్‌కి ట్విస్ట్ ఇస్తాడు. నాన్న అని పిలవడం ఎప్పటి నుంచి అలవాటు చేసుకున్నావ్.. ఇక్కడ అందరి కాళ్లకు నమస్కరిస్తా అతనికి తప్పా అని కన్నా షాక్ ఇస్తాడు. ఆ తర్వాత షాప్ ఓపెనింగ్ చేస్తారు. షాప్ పేరును శైలుతో ఓపెన్ చేయిస్తే ఆ పేరు చూసి శైలు షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com