Home

»

Tv News

Ye Devi Varamo Neevu Serial: అంజలికి రోహిత్ క్షమాపణ.. రాకీ ఏం చేయనున్నాడు!

Nov 10, 2026 8:20AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు' (Ye Devi Varamo Neevu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -111 లో... రాకీ ఇంట్లో నుంచి వెళ్లిపోతుంటే అంజలి ఆపి ఇప్పుడు అర్థమైందా ఒక ఆడపిల్ల జోలికి వస్తే ఎలా ఉంటుందోనని అంటుంది. నీ గురించి నిజం నీకు భయపడి చెప్పకుండా ఆగలేదు, నీ గురించి తెలిస్తే ఇంట్లో వాళ్లు భరించలేరని అంజలి అంటుంది. రాకీ దగ్గర ఉన్న డబ్బు అంజలి తీసుకుని నువ్వు ఈ ఇంట్లో నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోవడానికి వీల్లేదని అంటుంది.

 

మరోవైపు రోహిత్ టెన్షన్ పడుతుంటే అంజలి వస్తుంది. సారీ అంజలి అని రోహిత్ చెప్తుంటే అక్క అంటే చాలా మురిసిపోయాను కానీ ఇలా చేస్తావనుకోలేదు.. ఇప్పుడే ఈ విషయం ఇంట్లో వాళ్లకి చెప్తానని అంజలి అనగానే బావ చెప్పాడని అలా చేశానని రోహిత్ అంటాడు. జ్యూస్ లో మత్తు మందు నువ్వే కలిపావు కదా అని అంజలి కోప్పడుతుంది. సారీ అక్క అని రోహిత్ తన కాళ్లు పట్టుకుంటాడు. నువ్వు ఇంకొకసారి రాకీతో మాట్లాడితే ఊరుకోనని అంజలి వార్నింగ్ ఇస్తుంది. మరోవైపు రాకీ బయటకు వెళ్లి తన ఫ్రెండ్స్ కి కాల్ చేసి మీ రూమ్ కి వస్తానని అంటాడు. వాళ్లు ఊళ్లో లేరని చెప్తారు. చివరికి ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు.

ఆ తర్వాత కృష్ణజకి స్కూల్ లో క్లాసికల్ డాన్స్ ఉందని భవితని నేర్పించమంటుంది. తను వెస్ట్రన్ చేస్తుంది. అప్పుడే అంజలి వచ్చి క్లాసికల్ చేస్తుంది. తరువాయి భాగంలో అంజలి, మనీష్ ఇద్దరూ సరదాగా ఉంటారు. వాళ్లని చూసి రత్నం మురిసిపోతుంది. మనీష్ కి నీకు ముడి పడితే బాగుంటుందనగానే అంజలి తనలో తనే మురిసిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com