Home

»

Tv News

BiggBoss 10 Telugu: నామినేషన్ లో ముఖేష్ వర్సెస్ సుధీర్..చెంపదెబ్బ కొట్టుకున్న నీతూ మాస్టర్!

Nov 10, 2026 8:18AM

బిగ్ బాస్ తెలుగు సీజన్-10లో 10వ వారం నామినేషన్స్ లో హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. నామినేషన్ ప్రక్రియ మొదలవగానే పాత పగలు, కొత్త కోపాలు అన్నీ బయటపడ్డాయి. నామినేట్ చేసిన వాళ్ల ఫోటోని బాల్ కి తగిలించి గేట్ బయటకు తన్నాలని బిగ్ బాస్ చెప్పడంతో కంటెస్టెంట్లు ఒక్కొక్కరుగా ఫైర్ అయ్యారు. ఇందులో అత్యంత హైలైట్ గా నిలిచింది ముఖేష్ గౌడ వర్సెస్ సుధీర్ గొడవ. మొదటి వారాల నుంచి మంచి స్నేహితులుగా, ఒకే గ్రూపులో కొనసాగిన సుధీర్, ముఖేష్ ల మధ్య ఇప్పుడు దూరం పెరిగి పెద్ద గొడవకు దారితీసింది.

ముఖేష్ సుధీర్ ని నామినేట్ చేసి.. ఏదో ఒకరోజు కాటేస్తావ్ అనుకున్నా చేశావ్.. మా సపోర్ట్ లేకపోతే నువ్వు ఇంత వరకు వచ్చేవాడివి కాదు. నువ్వు నమ్మకద్రోహివి. నీ పర్సనాలిటీ కనిపించడం లేదు.. నీ కోసం నేను, ఝాన్సీ మా పవర్స్ వాడాం.. ఝాన్సీ వెళ్లిపోవడం నాకు గిల్ట్ గా ఉంది.. నువ్వు అందరి పనులు చేసుకుంటూ ఉంటావ్ అంటూ ఫైర్ అయ్యాడు. దానికి సుధీర్ కౌంటర్ ఇస్తూ.. నా క్యారెక్టర్ ని అంటున్నావ్, రోహిత్ ఆట నేను ఆడుతా అంటున్నావంటూ గొడవ పడ్డాడు. నేను లేకపోతే నువ్వు కెప్టెన్ వి కాకపోగా.. కనీసం కంటెండర్ గా కూడా అర్హుడవు కావంటూ ముఖేష్ చేసిన వ్యాఖ్యలు సుధీర్ పర్సనాలిటీని దెబ్బతీసేలా ఉన్నాయి.

ఈ గొడవలో శివ్ కూడా ఎంట్రీ ఇచ్చాడు. ముఖేష్ గుండు సున్నా అని సుధీర్ కౌంటర్ ఇవ్వగా.. శివ్ సైతం ముఖేష్ ను నామినేషన్ చేశాడు. ముకేష్ ఎప్పుడూ మబ్బుల్లో ఉంటాడు, గేమ్ అర్థం కాదు, సంఛాలక్ గా నువ్వు చేయడం వల్ల మాకు ఎఫెక్ట్ అయింది అంటూ శివ్ నామినేట్ చేశాడు. గోట్ లో నువ్వు అవ్వకుండా త్రిగుణ్ కి ఇచ్చేశావ్.. స్టార్స్ నీ దగ్గర పెట్టుకోలేదంటూ అమన్ కూడా శివ్ పై ఫైర్ అయ్యాడు. ఈ గొడవలో త్రిగుణ్, శివ్ కూడా గొడవ పడ్డారు. వర్షిణి కూడా ముఖేష్, సుధీర్ వ్యవహారంపై స్పందిస్తూ వారి మధ్య బంధాలు తల్లకిందులైనట్లు చూపించింది.నామినేషన్ల హీట్ లో కంటెస్టెంట్లు హద్దులు మీరుతున్న తరుణంలో నీతూ ప్రవర్తన ప్రధాన చర్చనీయాంశమైంది. త్రిగుణ్, వంశీలతో నామినేషన్ పాయింట్లు మాట్లాడుతున్నప్పుడు ఎమోషనల్ అయింది. తన ఫ్యామిలీ, కష్టాల గురించి మాట్లాడినప్పుడు సహనం కోల్పోయిన నీతూ, తనను తాను చెంప మీద కొట్టుకుంటూ శారీరకంగా బాధించుకుంది. గతంలో వంశీ ఇలాగే తనని తను కొట్టుకున్నప్పుడు హోస్ట్ నాగార్జున తిట్టాడు. ఇప్పుడు నీతూ కూడా అదే తరహాలో ప్రవర్తించడం పట్ల వీకెండ్ లో నాగార్జున ఎలా స్పందిస్తారో చూడాలి మరి. 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com