Home

»

Tv News

Podarillu: చక్రి డిసప్పాయింట్..కొత్త షాప్ కి ఏం పేరు పెడతారు? 

Nov 10, 2026 8:33AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ - 256 లో.... మాధవ, మనీషా రొమాంటిక్ గా మాట్లాడుకుంటారు. అప్పుడే చక్రి అక్కడికి వచ్చి మాధవకు మనీషా ముద్దు పెట్టడం చూసి షాక్ అవుతాడు. మెకానిక్ షాపులో అదే దారుణం అనుకుంటే ఇక్కడ ఇది మరీ దారుణమని.. వాళ్లిద్దరి జీవితాలు సెట్ అయ్యాయని, తన జీవితమే ఇలా అయిపోయిందని, పెళ్లయినా కనీసం ముద్దు పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నానని బాధపడతాడు. ఏదేమైనా మహాకు ముద్దు పెట్టాల్సిందేనని నిర్ణయించుకుని ఆఫీసుకు వెళ్తాడు. అక్కడ విక్కీతో పాటు స్టాఫ్ అందరూ ఉండగానే మహాకు ముద్దు పెట్టినట్లు, మహా లాగిపెట్టి కొట్టినట్లు కల కంటాడు. అది కల అని తెలుసుకుని ఊపిరి పీల్చుకుంటాడు. తర్వాత మాధవ ఎందుకొచ్చావని అడిగితే, చూడకూడనిది చూడటానికి వచ్చానని, అక్కడ మెకానిక్ షాపులో వాడి ముద్దు, ఇక్కడ కన్‌స్ట్రక్షన్ సైట్ ని నువ్వు శోభనం గది చేశావని బాధపడి వెళ్లిపోతాడు.

ఆ తర్వాత చక్రి నేరుగా మహా ఆఫీసుకు వెళ్లి తాను చూసిన దారుణాల గురించి చెప్తాడు. మెకానిక్ షాపులో మీ బుర్రుపిట్ట తన లవర్ కు ముద్దు పెట్టాడని, మీ పెద్దకి ఆ మనీషా ముద్దు పెట్టిందని చెప్పడంతో మహా ఆశ్చర్యపోతుంది. ఈ ఇంట్లో వాళ్లను కాదని బయటకు వచ్చిన మిమ్మల్ని నేను పెళ్లి చేసుకున్నా ఇప్పటివరకు ముద్దూముచ్చట ఏమీ లేదని బాధపడతాడు. మీకు కూడా త్వరలో మంచి అమ్మాయి దొరుకుతుందని మహా టాపిక్ మారుస్తుంది. కేశవ షాపు సంగతి ఏమైందని అడిగి షాపుకి తీసుకెళ్తుంది. మరోవైపు కేశవ కోసం గిఫ్ట్ ఇవ్వాలని శైలు తన కిడ్డీ బ్యాంక్ పగలగొడుతుంది. తల్లి వరాలు వచ్చి ఆ మెకానిక్ గాడి కోసమేనా అని అవమానించేలా మాట్లాడినా, నువ్వేమైనా బిల్ గేట్స్ కూతురివా మనది కూడా అలాంటి జీవితమే కదా అని శైలు అంటుంది. కేశవ కొత్త జీవితం మొదలుపెడుతున్నాడని గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నానని చెప్పి వెళ్లిపోతుంది.

శైలు నేరుగా కేశవ షాపుకి వెళ్లి తాను తెచ్చిన షర్ట్ ఇచ్చి, రేపు లక్ష్మీ పూజలో ఇదే వేసుకోవాలని ఆర్డర్ వేస్తుంది. అప్పుడే మహా, చక్రి కూడా అక్కడికి వస్తారు. షాపుకి ఏం పేరు పెడుతున్నావని మహా అడిగితే, ఇప్పటికే ఓ పేరు అనుకున్నానని కేశవ అంటాడు. అది తన పేరే అయి ఉంటుందని శైలు మనసులో అనుకుంటుంది. మాధవ పేరు పెట్టాలని మహా అంటే, అది పాత పేరులా ఉందని మహాలక్ష్మి పేరు పెట్టాలని చక్రి అంటాడు. దీంతో శైలు ముఖం వాడిపోతుంది. అది గమనించిన మహా ఇంటికి వెళ్లి మాట్లాడి నిర్ణయం తీసుకుందామని చెప్తుంది.తర్వాత ఇంట్లో షాపు పేరుపై చర్చ జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com